Saubhagya Singh Thakur | మోదీ మాటలను లెక్కచేయని బీజేపీ నేత.. 50 కార్లతో కాన్వాయ్ ఊరేగింపు
Saubhagya Singh Thakur : ఒక పక్క పెట్రోల్, డీజిల్‌ను జాగ్రత్తగా వాడాలని ప్రధాని మోదీ దేశ ప్రజలకు సలహా ఇస్తే.. ప్రజల సంగతేమోగానీ, బీజేపీ నేతలే లెక్కచేయడం లేదు.
Saubhagya Singh Thakur : ఒక పక్క పెట్రోల్, డీజిల్‌ను జాగ్రత్తగా వాడాలని ప్రధాని మోదీ దేశ ప్రజలకు సలహా ఇస్తే.. ప్రజల సంగతేమోగానీ, బీజేపీ నేతలే లెక్కచేయడం లేదు. మధ్యప్రదేశ్‌లో ఒక బీజేపీ నేత ఏకంగా 50 కార్లతో కాన్వాయ్ ఏర్పాటు చేసుకుని, ప్రయాణించాడు. దీంతో మోదీ మాటలను సొంత పార్టీ నేతలే లెక్కచేయడం లేదంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
మధ్యప్రదేశ్‌కు చెందిన బీజేపీ సీనియర్ నేత సౌభాగ్య సింగ్ ఠాకూర్ ఇటీవల ఆ రాష్ట్ర టెక్ట్స్‌బుక్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా ఎన్నికయ్యాడు. దీంతో తనకు పదవి వచ్చిందనే విషయాన్ని గొప్పగా చాటుకోవాలనుకున్నాడు. ఈ నేపథ్యంలో ఉజ్జయిన్ నుంచి భోపాల్ వరకు ఏకంగా 50 ఎస్‌యూవీలతో కాన్వాయ్ ఏర్పాటు చేశాడు. భారీ హంగు, ఆర్బాటాల మధ్య ఊరేగింపు నిర్వహించాడు. తన అనుచరులతో కలిసి ర్యాలీ నిర్వహించాడు. ట్రాఫిక్‌కు ఆటంకం కలిగించాడు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా వైరల్‌గా మారడంతో అతడి తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవలే ప్రధాని మోదీ.. చమురును పొదుపుగా వాడాలంటూ దేశ ప్రజలకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.
పెట్రోల్, డీజిల్ వాడకం తగ్గించాలని, కార్ పూలింగ్ చేయాలని, పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు వినియోగించాలని పిలుపునిచ్చారు. చమురును ఎక్కువగా విదేశాల నుంచే దిగుమతి చేసుకుంటున్నామని చెప్పారు. దీనివల్ల విదేశాల నుంచి చమురు కొనుగోళ్లు తగ్గి, విదేశీ మారక నిల్వలు మిగులుతాయని ప్రధాని అన్నారు.అలాంటిది, మోదీ పార్టీ అయిన బీజేపీ నేత సౌభాగ్య సింగ్ ఠాకూర్.. తన ప్రచారం కోసం అనవసరంగా 50 భారీ వాహనాల్ని వాడటంపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RC 17 | రామ్ చరణ్ – సుకుమార్ సినిమాలో హీరోయిన్గా తెలుగు అమ్మాయి.. రేసులోకి ఆ అమ్మడి పేరు!
School Van | కురవిలో స్కూల్ వ్యాన్ బోల్తా, 12 మంది విద్యార్థులకు గాయాలు.. డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమా?
Samantha | సినిమాలకు మించి వ్యాపారాల్లో సమంత జోరు.. 8 నెలల్లోనే రూ.120 కోట్ల టర్నోవర్‌తో హాట్ టాపిక్!
Suryapet | సూర్యాపేట జిల్లాలో విషాదం.. పిడుగుపాటుకు 32 ఏళ్ల గొర్రెల కాపరి మృతి!
వట్టినాగులపల్లిలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. 27 మంది అరెస్ట్!
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

