School Van | కురవిలో స్కూల్ వ్యాన్ బోల్తా, 12 మంది విద్యార్థులకు గాయాలు.. డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమా?
School Van Accident | పాఠశాలకు వెళ్లేందుకు ఎంతో ఉత్సాహంగా స్కూల్ వ్యాన్ ఎక్కిన చిన్నారులకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. డ్రైవర్ నిర్లక్ష్యంతో విద్యార్థులతో వెళ్తున్న వ్యాన్ అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో 12 మంది చిన్నారులు గాయపడ్డారు.
School Van | కురవి, అక్టోబర్ 31: పాఠశాలకు వెళ్లేందుకు ఎంతో ఉత్సాహంగా స్కూల్ వ్యాన్ ఎక్కిన చిన్నారులకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. డ్రైవర్ నిర్లక్ష్యంతో విద్యార్థులతో వెళ్తున్న వ్యాన్ అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో 12 మంది చిన్నారులు గాయపడ్డారు. అయితే వ్యాన్ చెరువు శిఖంలోని బూరుగు చెట్టుకు తగిలి ఆగిపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. లేదంటే వ్యాన్ నేరుగా చెరువులోకి దూసుకెళ్లి ఉండేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు.
మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రంలోని గీతాంజలి ప్రైవేట్ పాఠశాలకు చెందిన టాటా ఏస్ వ్యాన్ శనివారం ఉదయం రేకుల తండాలో విద్యార్థులను ఎక్కించుకుంది. అనంతరం కురవి, తిరుమలాపురం గ్రామాల్లో మరికొందరు చిన్నారులను ఎక్కించుకుని నల్లెల్లకు బయలుదేరింది. ఈ క్రమంలో తిరుమలాపురం శివారులోని పెద్ద చెరువు కల్వర్టు వద్దకు రాగానే వ్యాన్ ఒక్కసారిగా అదుపుతప్పింది. రోడ్డు దిగి కల్వర్టు అంచు నుంచి కిందకు వెళ్లి చెరువు శిఖంలో బోల్తాపడింది. ఈ క్రమంలో అక్కడున్న బూరుగు చెట్టుకు వ్యాన్ తగిలి ఆగిపోయింది. వ్యాన్ చెట్టుకు తగిలి ఆగిపోవడంతో అందులోని చిన్నారులు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. చెట్టు అడ్డుగా లేకుంటే వ్యాన్ నేరుగా చెరువులోకి దూసుకెళ్లేదని స్థానికులు పేర్కొన్నారు.
ఈ ప్రమాదంలో రేకుల తండాకు చెందిన రెండో తరగతి విద్యార్థిని దక్షిత, రామచంద్రాపురానికి చెందిన యూకేజీ విద్యార్థి వేదాంశ్, తిరుమలాపురానికి చెందిన వెళ్లెను వేదాంశ్, కురవికి చెందిన కానుగంటి తన్మయి శ్రీతో పాటు మొత్తం 12 మంది విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాద సమాచారం అందుకున్న కురవి ఎస్సై సతీష్ పోలీసు సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.
ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్!
ప్రమాదం గురించి తెలియగానే పిల్లల తల్లిదండ్రులు ఘటనాస్థలికి చేరుకున్నారు. డ్రైవర్ పందిరి రాజేష్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపించారు. వాహనం నడుపుతున్న సమయంలో ఫోన్లో మాట్లాడుతుంటాడని డ్రైవర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో కొందరు అతడిపై దాడికి పాల్పడటంతో డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. కాగా, వ్యాన్ డ్రైవర్‌కు డ్రైవింగ్ లైసెన్స్ కూడా లేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. చిన్నారులను పాఠశాలకు తీసుకెళ్లే వాహనాల విషయంలో ఇలాంటి నిర్లక్ష్యాన్ని సహించకూడదని, సంబంధిత అధికారులు, పాఠశాల యాజమాన్యం బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం తల్లిదండ్రులు తమ పిల్లలను ఇళ్లకు తీసుకెళ్లారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
School Van | కురవిలో స్కూల్ వ్యాన్ బోల్తా, 12 మంది విద్యార్థులకు గాయాలు.. డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమా?
Samantha | సినిమాలకు మించి వ్యాపారాల్లో సమంత జోరు.. 8 నెలల్లోనే రూ.120 కోట్ల టర్నోవర్‌తో హాట్ టాపిక్!
Suryapet | సూర్యాపేట జిల్లాలో విషాదం.. పిడుగుపాటుకు 32 ఏళ్ల గొర్రెల కాపరి మృతి!
వట్టినాగులపల్లిలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. 27 మంది అరెస్ట్!
కేసీఆర్ మళ్లీ సీఎం కావాలంటూ యువకుడి పాదయాత్ర.. మార్గమధ్యలో కలిసి అభినందించిన ఆల వెంకటేశ్వర్ రెడ్డి!
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

