Samantha | సినిమాలకు మించి వ్యాపారాల్లో సమంత జోరు.. 8 నెలల్లోనే రూ.120 కోట్ల టర్నోవర్‌తో హాట్ టాపిక్!
Samantha | టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు సినిమాలతోనే కాకుండా వ్యాపార రంగంలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. నటిగా ప్రేక్షకులను అలరిస్తూనే, మరోవైపు పలు వ్యాపారాల్లో పెట్టుబడులు పెడుతూ వ్యాపారవేత్తగా ఎదుగుతున్నారు. ఇటీవల ‘మా ఇంటి బంగారం’ సినిమాతో విజయాన్ని అందుకున్న సమంత ప్రస్తుతం సినిమాలకు కొంత విరామం ఇస్తూ వ్యక్తిగత జీవితంపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది
Samantha | టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు సినిమాలతోనే కాకుండా వ్యాపార రంగంలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. నటిగా ప్రేక్షకులను అలరిస్తూనే, మరోవైపు పలు వ్యాపారాల్లో పెట్టుబడులు పెడుతూ వ్యాపారవేత్తగా ఎదుగుతున్నారు. ఇటీవల ‘మా ఇంటి బంగారం’ సినిమాతో విజయాన్ని అందుకున్న సమంత ప్రస్తుతం సినిమాలకు కొంత విరామం ఇస్తూ వ్యక్తిగత జీవితంపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆమె స్థాపించిన పెర్ఫ్యూమ్ బ్రాండ్ ‘సీక్రెట్ ఆల్కెమిస్ట్’ భారీ టర్నోవర్ సాధించిందనే వార్త ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
సమంత కొన్ని నెలల క్రితం ‘సీక్రెట్ ఆల్కెమిస్ట్’ పేరుతో పెర్ఫ్యూమ్ బ్రాండ్‌ను ప్రారంభించారు. అంకితా థడానీ, ఆకాష్ వాలియాతో కలిసి ఈ వ్యాపారాన్ని స్థాపించారు. తాజాగా ఈ సంస్థ విజయాన్ని పురస్కరించుకుని ప్రత్యేక కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. ఈ బ్రాండ్ ప్రారంభమైన కేవలం ఎనిమిది నెలల్లోనే సుమారు రూ.120 కోట్ల టర్నోవర్ సాధించిందనే ప్రచారం జరుగుతోంది. ఈ వార్త బయటకు రావడంతో సమంత వ్యాపార విజయంపై ఆసక్తికర చర్చ మొదలైంది. అయితే టర్నోవర్ అంటే కంపెనీ మొత్తం అమ్మకాల విలువ మాత్రమే. అది నికర లాభం కాదు. సంస్థకు వచ్చిన వాస్తవ లాభాలు ఎంతన్నది స్పష్టంగా తెలియాల్సి ఉంది. అయినప్పటికీ తక్కువ సమయంలోనే ఇంతటి వ్యాపారాన్ని సాధించిందనే ప్రచారం సమంత బ్రాండ్‌పై అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
సమంతకు పెర్ఫ్యూమ్ వ్యాపారంతో పాటు పలు రంగాల్లో సంస్థలు, పెట్టుబడులు ఉన్నాయి. ‘సాకి’ పేరుతో దుస్తుల వ్యాపారం నిర్వహిస్తున్నారు. ‘ఏకం’ పేరుతో ప్రీ స్కూల్ రంగంలోనూ అడుగుపెట్టారు. ‘ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్’ పేరుతో నిర్మాణ సంస్థను స్థాపించారు. వీటితో పాటు పికిల్‌బాల్ రంగంలో ‘చెన్నై సూపర్ ఛాంప్స్’ జట్టుతోనూ ఆమెకు అనుబంధం ఉంది. ఇంకా పలు రంగాల్లో పెట్టుబడులు పెట్టినట్లు తెలుస్తోంది.కరోనా సమయంలో, అలాగే మయోసైటిస్ సమస్యతో సినిమాలకు దూరంగా ఉన్న సమయంలో సమంత వ్యాపార రంగంపై పరిశోధన చేసి పెట్టుబడులు పెట్టినట్లు గతంలో వెల్లడైంది. అలా ఒక్కో రంగంలో అవకాశాలను గుర్తిస్తూ తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటున్నారు. ఇప్పుడు ‘సీక్రెట్ ఆల్కెమిస్ట్’ టర్నోవర్‌పై వస్తున్న వార్తలు ఆమె వ్యాపార ప్రయాణంపై మరింత ఆసక్తిని పెంచాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Samantha | సినిమాలకు మించి వ్యాపారాల్లో సమంత జోరు.. 8 నెలల్లోనే రూ.120 కోట్ల టర్నోవర్‌తో హాట్ టాపిక్!
Suryapet | సూర్యాపేట జిల్లాలో విషాదం.. పిడుగుపాటుకు 32 ఏళ్ల గొర్రెల కాపరి మృతి!
వట్టినాగులపల్లిలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. 27 మంది అరెస్ట్!
కేసీఆర్ మళ్లీ సీఎం కావాలంటూ యువకుడి పాదయాత్ర.. మార్గమధ్యలో కలిసి అభినందించిన ఆల వెంకటేశ్వర్ రెడ్డి!
Bigg Boss 10 | ఈ వారం ఎలిమినేషన్ డేంజర్లో ఆ నలుగురు.. టాప్‌లో వంశీ, రోహిత్!
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

