CAA Implements | సీఏఏ అమలుకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటిషన్
CAA Implements | వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) అమలుకు మోదీ ప్రభుత్వం సోమవారం నోటిఫికేషన్ జారీచేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ చట్టం (Citizenship Law) అమలుకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు (Supreme Court)లో పిటిషన్ దాఖలైంది.
CAA Implements | వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) అమలుకు మోదీ ప్రభుత్వం సోమవారం నోటిఫికేషన్ జారీచేసిన విషయం తెలిసిందే. లోక్‌సభ ఎన్నికలకు ముందు కేంద్రం సీఏఏ నోటిఫికేషన్ జారీ చేయడంపై విపక్షాలు భగ్గుమంటున్నాయి. ప్రతిపక్ష కాంగ్రెస్ సహా తృణమూల్, సీపీఐ, ఆప్, సమాజ్‌వాదీ, డీఎంకే తదితర పార్టీలు ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో తాజాగా ఈ చట్టం (Citizenship Law) అమలుకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు (Supreme Court)లో పిటిషన్ దాఖలైంది. ఈ వివాదాస్పద చట్టాన్ని అమలు చేయకుండా స్టే విధించాలని కోరుతూ ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (Indian Union Muslim League) దేశ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. సీఏఏ వల్ల నిర్దిష్ట మతాలకు మాత్రమే పౌరసత్వం దక్కుతుందని, ఈ చట్టం ప్రాథమికంగా రాజ్యాంగ విరుద్ధమని పిటిషన్లో పేర్కొంది.
లోక్‌సభ ఎన్నికలకు ముందు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొన్నది. నాలుగేండ్ల కిందట ఆమోదం పొందిన వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం-2019 (సీఏఏ)ను తాజాగా అమల్లోకి తీసుకొచ్చింది. ఈ మేరకు సోమవారం సాయంత్రం నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన వారు భారత పౌరసత్వం కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని, దీని కోసం వెబ్ పోర్టల్‌ను కూడా సిద్ధం చేసినట్టు హోంమంత్రిత్వ శాఖకు చెందిన ప్రతినిధి ఒకరు తెలిపారు. విపక్షాల తీవ్ర నిరసనల మధ్య 2019 డిసెంబర్ 11న సీఏఏ బిల్లు-2019 పార్లమెంటు ఆమోదం పొందిన విషయం తెలిసిందే.
Also Read..
Seema Haider | సీఏఏ అమలును స్వాగతించిన పాక్ మహిళ సీమా హైదర్.. ప్రధాని మోదీపై ప్రశంసలు
Thalapathy Vijay | ఆ చట్టం ఆమోదయోగ్యం కాదు.. సీఏఏ అమలు వద్దంటూ తమిళ సర్కార్‌ను కోరిన హీరో విజయ్
CAA Implementation | ఎన్నికల కోసమే సీఏఏ అమలు : కాషాయ పార్టీపై సేన, ఎస్పీ ఫైర్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Farmers Protest | మోటార్లు తొలగించాలన్న ఆదేశాలకు నిరసనగా రైతుల ఆందోళన
Navaratri Brahmotsavams | మోహినీ అలంకారంలో జగన్మోహనాకారుడిగా దర్శనమిచ్చిన శ్రీ మలయప్పస్వామి
Armoor | ఆర్మూర్ 10వ వార్డులో డ్రైనేజీ అస్తవ్యస్తం.. ఇబ్బంది పడుతున్న జనం
Ranabali Review | ‘రణబాలి’ మూవీ రివ్యూ: విజయ్ దేవరకొండ బాక్సాఫీస్ పూనకం.!
Ramayana | విజువల్ వండర్‌గా ‘రామాయణం’ కొత్త ట్రైలర్.. శ్రీరాముడిగా రణ్‌బీర్, రావణాసురుడిగా యశ్ అదుర్స్!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

