CAA Implementation | ఎన్నికల కోసమే సీఏఏ అమలు : కాషాయ పార్టీపై సేన, ఎస్పీ ఫైర్
CAA Implementation : లోక్‌సభ ఎన్నికలకు ముందు కకేంద్ర ప్రభుత్వం సీఏఏ నోటిఫికేషన్ జారీ చేయడంపై శివసేన (యూబీటీ) ప్రతినిధి ఆనంద్ దూబే విస్మయం వ్యక్తం చేశారు.
CAA Implementation : లోక్‌సభ ఎన్నికలకు ముందు కేంద్ర ప్రభుత్వం సీఏఏ నోటిఫికేషన్ జారీ చేయడంపై శివసేన (యూబీటీ) ప్రతినిధి ఆనంద్ దూబే విస్మయం వ్యక్తం చేశారు. పదేండ్ల కిందట ప్రవేశపెట్టిన సీఏఏను ఎన్నికల షెడ్యూల్ విడుదలకు నాలుగు రోజుల ముందు అమలు చేసేందుకు పూనుకోవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నోటిఫికేషన్‌తో ఏం ఆశిస్తున్నారు..సీఏఏను అనూహ్యంగా అమలు చేయడం వెనుక రాజకీయ ప్రయోజనాలు ఆశించారని, ఎన్నికల కోసమే ఇదంతా చేస్తున్నారని బీజేపీని ఉద్దేశించి దూబే విమర్శలు గుప్పించారు.
ఎన్నికల వాతావరణాన్ని ప్రభావితం చేసేందుకు సీఏఏ అమలు ద్వారా దేశంలో అరాచక పరిస్దితులు నెలకొనేలా బీజేపీ వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. ఎన్నికల్లో గెలుపు కోసం బీజేపీ ఎంతకైనా తెగిస్తుందని అన్నారు. ధరల పెరుగుదల, దేశంలో నిరుద్యోగం వంటి ప్రదాన అంశాలపై బీజేపీ నోరు మెదపదని, వారు ఇచ్చిన హామీల అమలుపై ఆసక్తి చూపరని దూబే మండిపడ్డారు.
రామ రాజ్యం అంటే ఏంటో బీజేపీకి తెలుసా అని ప్రశ్నించారు. రాముడు తానిచ్చిన మాట కోసం అరణ్యవాసం చేశారని, కానీ బీజేపీ పాలకులు పార్టీలను చీల్చి ప్రత్యర్దులను జైళ్లలో పెడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల్లో గెలుపు కోసం సీఏఏను తెరపైకి తెచ్చారని, కానీ ప్రజలకు అన్నీ తెలుసునని అన్నారు. ఇక సీఏఏ నోటిఫికేషన్‌పై ఎస్పీ నేత ఎస్టీ హసన్ ఆందోళన వ్యక్తం చేశారు. వాస్తవ అంశాల నుంచి ప్రజల్ని పక్కదారి పట్టించేందుకే కేంద్రం సీఏఏను తెరపైకి తీసుకువచ్చిందని దుయ్యబట్టారు.
Read More :
Seema Haider | సీఏఏ అమలును స్వాగతించిన పాక్ మహిళ సీమా హైదర్.. ప్రధాని మోదీపై ప్రశంసలు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రైతులు యాసంగిలో వరి వేయొద్దు : దాసరి హరిచందన
మేడిగడ్డ దగ్గర బాంబ్ పేలిన శబ్దం వచ్చింది..! దీనిపై విచారణ జరపాలి : మాజీ ఈఎన్సీ మురళీధర్ రావు
Multi Starrer | ఎన్టీఆర్, అల్లు అర్జున్‌తో నెల్సన్ భారీ మల్టీస్టారర్.. కథ కూడా వినిపించారా?
Maruti Patel Dongre | ప్రభుత్వ వైఫల్యంతోనే ఎండిపోతున్న పంటలు : మారుతి పటేల్ డోంగ్రే
‘క్యాన్సర్‌ను తొలి దశలోనే గుర్తిస్తే సంపూర్ణ చికిత్స’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

