న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా(Australia) ఓపెనింగ్ బ్యాటర్ డేవిడ్ వార్నర్(David Warner) .. రెండో టెస్టు నుంచి దూరం అయ్యాడు. కాంకషన్ (Concussion)వల్ల అతన్ని రెండో టెస్టుకు దూరం పెట్టారు. అతని స్థానంలో మ్యాట్ రెన్షాను తీసుకున్నారు. ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా స్టేడియంలో ఇండియా, ఆస్ట్రేలియా మధ్య రెండో టెస్టు జరుగుతున్న విషయం తెలిసిందే. తొలి ఇన్నింగ్స్‌లో వార్నర్ బ్యాటింగ్ చేశాడు. 44 బంతులు ఆడిన అతను 15 రన్స్ చేశాడు. అయితే రెండో రోజు ఆట ఇవాళ ప్రారంభమైన తర్వాత వార్నర్ ఫీల్డింగ్‌కు రాలేదు. కాంకషన్ వల్ల ఆ టెస్టుకు దూరం అవుతున్నట్లు మేనేజ్మెంట్ ప్రకటించింది.
🚨 JUST IN: Australia to use the concussion substitute rule as star opener is ruled out of second #INDvAUS Test.
Details 👇https://t.co/cRsCcsbeBU
— ICC (@ICC) February 18, 2023