దళిత విద్యార్థిపై రాడ్డుతో టీచర్ దాడి
బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లో మరో దారుణం జరిగింది. పరీక్షలో స్పెల్లింగ్ తప్పు రాశాడనే నెపంతో దళిత విద్యార్థిని అగ్రకుల ఉపాధ్యాయుడు రాడ్డుతో విచక్షణారహితంగా చావబాదాడు.
- చికిత్స పొందుతూ బాలుడి మృతి
- బీజేపీ పాలిత యూపీలో ఘోరం
లక్నో, సెప్టెంబర్ 26: బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లో మరో దారుణం జరిగింది. పరీక్షలో స్పెల్లింగ్ తప్పు రాశాడనే నెపంతో దళిత విద్యార్థిని అగ్రకుల ఉపాధ్యాయుడు రాడ్డుతో విచక్షణారహితంగా చావబాదాడు. అపస్మారకస్థితికి వెళ్లిన బాలుడు చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచాడు. ఔరైయా జిల్లాకు చెందిన దళిత విద్యార్థి నిఖిత్ దొహ్రే (15) పదో తరగతి చదువుతున్నాడు. ఈ నెల 7న ఉపాధ్యాయుడు అశ్వినీసింగ్ సాంఘికశాస్త్రంపై విద్యార్థులకు పరీక్ష నిర్వహించాడు. విద్యార్థి నిఖిత్ జవాబులో స్పెల్లింగ్ తప్పుగా రాశాడు. దీంతో విచక్షణ కోల్పోయిన ఉపాధ్యాయుడు విద్యార్థి నిఖిత్ను రాడ్లు, కర్రలతో కొట్టాడు. పలుమార్లు తన్నాడు. కులం పేరుతో దూషించాడు. తీవ్రంగా గాయపడి స్పృహ కోల్పోయిన విద్యార్థి నిఖిత్ను దవాఖానకు తరలించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. నాటి నుంచి దవాఖానలో చికిత్స పొందుతున్న విద్యార్థి శనివారం రాత్రి మరణించాడు. పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Dalit Student
- Rod
- Teacher
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

