మైసూరు, జనవరి 3: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రాతినిధ్యం వహిస్తున్న వరుణ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని శ్రీనివాసపుర గ్రామంలో ఓ దళిత కుటుంబంపై గ్రామ పెద్దలు సాంఘిక బహిష్కరణకు ఆదేశించారు. సిద్ధరామయ్య జన్మస్థలం సిద్ధరామనహుండీ గ్రామ సమీపంలోనే శ్రీనివాసపుర ఉండడంతో ఈ వివాదం సంచలనంగా మారింది.
పంచాయతీ ఆదేశాలను ఉల్లంఘించామన్న కారణంపై గ్రామ పెద్దలు తమపై సాంఘిక బహిష్కరణ ప్రకటించారని ఆ దళిత కుటుంబం తెలిపింది. పంచాయతీ విధించిన రూ.15,000 జరిమానా చెల్లించేందుకు నిరాకరించిన కారణంగానే తమను సాంఘికంగా బహిష్కరించారని పేర్కొన్నది. గ్రామానికి చెందిన ప్రమోద్, సురేష్ గొడవపడడంతో వారికి గ్రామపెద్దలు జరిమానా విధించారు. దానికి సురేష్ నిరాకరించడంతో కుటుంబాన్ని గ్రామపెద్దలు బహిష్కరించారు.