న్యూఢిల్లీ: క్రమబద్ధమైన ఆదాయ వనరు లేదన్న సాకుతో భార్య, పిల్లలకు భరణం చెల్లించే బాధ్యత నుంచి భర్త తప్పించుకోలేడని ఢిల్లీ హైకోర్టు తీర్పు చెప్పింది. తన భార్య, ఇద్దరు కుమార్తెలకు నెలకు రూ.11వేల చొప్పున భరణం చెల్లించాలంటూ ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఒక భర్త దాఖలు చేసిన పిటిషన్ను జస్టిస్ సౌరభ్ బెనర్జీ కొట్టివేశారు.
తాను కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగం చేస్తున్నందున స్థిరమైన ఆదాయం లేదని, టీబీ, హృద్రోగ వ్యాధులతో బాధపడుతున్నానని, వృద్ధురాలైన తల్లిని చూసుకోవాలని, నెలవారీ రుణ బకాయిలు చెల్లించాల్సి ఉందని పిటిషనర్ పేర్కొన్నారు. కామర్స్ గ్రాడ్యుయేట్ అయిన తన భార్యకు ఉద్యోగం చేయగల సామర్థ్యం ఉందని, తనను తాను పోషించుకోగలదని ఆయన తెలిపాడు. అయితే కుబేరుడైనా, రోజువారీ కూలీ అయినా భర్తకు తన భార్య పిల్లలకు భరణం ఇచ్చ బాధ్యత ఉంటుందని కోర్ట్ తీర్పు చెప్పింది.