Dry Fruits | న్యూఢిల్లీ: రోజూ కొన్ని డ్రై ఫ్రూట్స్ తినటం వల్ల 17 రకాల క్యాన్సర్ వ్యాధుల ముప్పు తగ్గుతుందని తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. డ్రై ఫ్రూట్స్, తృణ ధాన్యాల్లో ఉండే యాంటీఆక్సిడెంట్స్, మంచి కొవ్వుల వల్ల రొమ్ము క్యాన్సర్, పెద్ద పేగు, పాంక్రియాటిక్ క్యాన్సర్లు తలెత్తే ముప్పు తగ్గుతుందని పరిశోధకులు గుర్తించారు.
ఆస్ట్రేలియాలోని ‘మోనాష్ యూనివర్సిటీ’కి చెందిన పరిశోధకుల బృందం చేపట్టిన స్టడీలో 70 ఏండ్ల వరకు జీవించిన దాదాపు 10వేల మంది పాల్గొన్నారు. తినే ఆహారానికి, క్యాన్సర్కు ఉన్న సంబంధం కాదనలేనిదని అధ్యయనం పేర్కొన్నది.ప్రాసెస్డ్ ఫుడ్, రెడ్ మీట్, చక్కెర పానీయాలు క్యాన్సర్ ముప్పును పెంచుతాయని, 30-50 శాతం క్యాన్సర్ వ్యాధుల్ని మంచి ఆహారం, జీవనశైలితో అరికట్ట వచ్చునని అధ్యయనం తెలిపింది.