Anti-Drone System | డ్రోన్ దాడులను తిప్పికొట్టే డీ4.. యాంటీ డ్రోన్ వ్యవస్థను ఆవిష్కరించిన భారత్
మన వైమానిక రక్షణ దళంలో కొత్త సాంకేతికత చేరింది. రక్షణ వ్యవస్థలో గేమ్ ఛేంజర్ లాంటి శక్తివంతమైన డీ4తో మన వైమానిక దళం మరింత పటిష్టంగా మారనుంది. నేటి ఆధునిక యుగంలో డ్రోన్లు యుద్ధ రంగంలో కీలకంగా మారాయి. జమ్మూ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌పై 2021లో జరిగిన డ్రోన్ దాడినే దీనికి ఉదాహరణగా పేర్కొనవచ్చు.
Anti-Drone System | న్యూఢిల్లీ, మార్చి 23 : మన వైమానిక రక్షణ దళంలో కొత్త సాంకేతికత చేరింది. రక్షణ వ్యవస్థలో గేమ్ ఛేంజర్ లాంటి శక్తివంతమైన డీ4తో మన వైమానిక దళం మరింత పటిష్టంగా మారనుంది. నేటి ఆధునిక యుగంలో డ్రోన్లు యుద్ధ రంగంలో కీలకంగా మారాయి. జమ్మూ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌పై 2021లో జరిగిన డ్రోన్ దాడినే దీనికి ఉదాహరణగా పేర్కొనవచ్చు. అయితే భవిష్యత్తులో భారత్‌కు ఇలాంటి పరిస్థితి ఎదురుకాకుండా సమర్థంగా డ్రోన్ దాడులను ఎదుర్కొనేందుకే మన వైమానిక దళం యాంటీ డ్రోన్ వ్యవస్థను ఆవిష్కరించింది. డీఆర్డీవో ఆధ్వర్యంలో తయారైన డీ4ను దేశ సరిహద్దుల్లోని ప్రధాన ప్రాంతాల్లో మోహరిస్తారు.
డ్రోన్ గుర్తింపు, అడ్డగింత, నాశనం ఈ మూడు లక్షణాలు కలిగి ఉన్న డీ4 ఇప్పటివరకు మన సరిహద్దుల వద్ద ఉన్న బలహీన పరిస్థితులను అధిగమిస్తుందని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు బహుళస్థాయిలుగా ఉంటుంది. వివిధ సాంకేతిక పరిజ్ఞానాల ఏకీకరణతో దీనిని రూపొందించారు. ముఖ్యంగా ఇందులో రేడియో ఫ్రీక్వెన్సీ గుర్తింపు, రాడార్, ఎలక్ట్రో ఆప్టికల్ ట్రాకింగ్, కృత్రిమ మేధ ఆధారిత ముప్పు వర్గీకరణ, ఎలక్ట్రానిక్ జామింగ్, యుక్తి ప్రదర్శన, హార్డ్ కిల్, సాఫ్ట్ కిల్ న్యూట్రలైజేషన్ వంటి సాంకేతికతలను పొందుపరిచారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

