Gas Cylinder : బంగారం దుకాణం (Gold shop) లో గ్యాస్ సిలిండర్ (Gas cylinder) పేలి ఎనిమిది మంది దుర్మరణం పాలయ్యారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. రాజస్థాన్ రాష్ట్రం (Rajasthan) బికనీర్ జిల్లా (Bikaner district) లోని మదాన్ (Madan) మార్కెట్ ఏరియా (Market area) లో ఈ ప్రమాదం జరిగింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
సిలిండర్ పేలుడు ధాటికి ఆ దుకాణం ఉన్న భవనం ధ్వంసమైంది. బంగారం దుకణాంలోని గ్యాస్ స్టవ్‌పై పాత బంగారం, వెండిని కరిగించేందుకు మరగబెడుతుండగా ఒక్కసారిగా సిలిండర్ పేలిపోయిందని పోలీసులు తెలిపారు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే ఘటనా ప్రాంతానికి వెళ్లి మృతదేహాలను పోస్టు మార్టానికి పంపించారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.