భువనేశ్వర్: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర తుఫాన్‌గా మారింది. ఒడిశా, బెంగాల్ తీరాన్ని దాన తుఫాన్(Cyclone Dana).. ఇవాళ కానీ రేపు కానీ తీరం దాటే అవకాశం ఉన్నది. ఆ సమయంలో తీరం వెంట గంటకు 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయనున్నాయి. ఒడిశాలోని బాలాసోర్, భద్రక్, కేంద్రపాద, బయూర్‌బంజ్, జగత్సింగ్పుర్, పూరి జిల్లాలపై తుఫాన్ ప్రభావం తీవ్రంగా ఉండనున్నది. తుఫాన్ నేపథ్యంలో భారతీయ వైమానిక దళానికి చెందిన రెండు విమానాలు ఎన్డీఆర్ఎప్ దళాలతో సిద్దంగా ఉన్నాయి. బటిండా నుంచి ఐఎల్ 76, ఏఎన్ 32 విమానాలు రిలీఫ్ మెటీరియల్‌తో భువనేశ్వర్ చేరుకున్నాయి.
Odisha: Indian Air Force airlifts NDRF team, relief material ahead of Cyclone Dana landfall
Read @ANI Story | https://t.co/sLFlhcKeAB#IAF #CycloneDana #NDRF pic.twitter.com/LX51kqMfpt
— ANI Digital (@ani_digital) October 23, 2024
బెంగాల్‌లోని పలు జిల్లాల్లో 23వ తేదీ నుంచి 26వ తేదీ వరకు స్కూళ్లను మూసివేశారు. పలు జిల్లాలో సుమారు 500 రిలీఫ్ సెంటర్లను ఏర్పాటు చేసినట్లు ఒడిశా మంత్రి సురేశ్ పూజారి తెలిపారు. లక్షలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించనున్నట్లు వెల్లడించారు.
Subject: Cyclonic storm over eastcentral Bay of Bengal (Cyclone Alert for Odisha and West Bengal coasts)
Yesterday’s deep depression over Eastcentral Bay of Bengal moved west-northwestwards with a speed of 18 kmph during past 6 hours intensified into a cyclonic storm “DANA”… pic.twitter.com/erbYsIBmaw
— India Meteorological Department (@Indiametdept) October 23, 2024