ముంబై, ఫిబ్రవరి 11(నమస్తే తెలంగాణ): మనీలాండరింగ్‌లో భాగస్వాములయ్యారంటూ సైబర్ నేరగాళ్లు ముంబైలో ఒక ఎల్ఐసీ రిటైర్డ్ మేనేజర్, అతని కుటుంబం నుంచి రూ.1.10 కోట్లను దోచుకున్నారు. ఫిబ్రవరి 1న చంద్రభాన్ పలివాల్‌కు సైబర్ నేరగాళ్లు ఫోన్ కాల్ చేసి, వివిధ రకాలుగా అతడ్ని బెదిరించారు. వీడియో కాల్లో అనేక రకాలుగా భయభ్రాంతులకు గురిచేస్తూ, ఐదు రోజుల పాటు చంద్రభాన్ కుటుంబాన్ని డిజిటల్ అరెస్ట్ చేశారు.
మీపై 24 కేసులున్నాయంటూ.. చంద్రభాన్ బ్యాంక్ ఖాతా నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు డ్రా చేసి, మరో బ్యాంక్‌కు తరలించారు. జరిగిన సంగతి తెలుసుకున్నాక పోలీసులు సైతం షాక్‌కు గురయ్యారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. బెంగళూరులోని ఖాతాకు నగదు బదిలీ అయినట్లు ప్రాథమికంగా పోలీసులు గుర్తించారు.