న్యూఢిల్లీ, డిసెంబర్ 20: సైబర్ నేరగాళ్లు కొత్తకొత్త రకాల మోసాలతో ప్రజలపై విరుచుకుపడుతున్నారు. కొత్తగా వాట్సా ప్ యూజర్స్ లక్ష్యంగా సైబర్ క్రిమినల్స్ ఘోస్ట్ పెయిరింగ్ అనే మరో స్కామ్‌తో దాడి చేస్తున్నారు. యాప్‌లోని డివైజ్ లింకింగ్ అనే ఫీచర్‌ను అవకాశంగా తీసుకుని దాడికి పాల్పడుతున్నారు. ఓటీపీ, వెరిఫికేషన్ కోడ్, సిమ్ స్వాప్‌తో సంబంధం లేకుండా ప్రమాదకరమైన డివైజ్‌లకు యాక్సెస్ ఇవ్వడం ద్వారా చాలా మంది మోసాలకు గురవుతున్నారు. వాట్సాప్ యాప్ సైబర్ దాడి చేసే వారి డివైజ్‌కు లింక్ కాగానే ఫోన్లోని మొత్తం డాటా వెళ్లిపోతుంది.
దీంతో సైబర్ నేరగాళ్లు బ్యాంకు ఖాతాలను ఖాళీ చేయడం, ఫోన్లోని వ్యక్తిగత సమాచారాన్ని తీసుకోవడం ప్రధానంగా స్కామ్ ఉద్దేశం. స్కామ్ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను జెన్ డిజిటల్ అనే సైబర్ సెక్యూరిటీ సంస్థ వెల్లడించింది. ఫోన్లో సేవ్ అయిన కాంటాక్ట్ నంబర్ నుంచే వాట్సాప్‌లో Hey, I just found your photo అనే తరహాలో ఫేస్బుక్ లింక్‌ను పోలిన మెస్సేజ్ వస్తుంది. ఆ లింక్ మీద క్లిక్ చేయగానే ఫేస్బుక్ ఫొటో వ్యూయర్‌ను పోలిన వెబ్ పేజ్ ఓపెన్ అవుతుంది. తర్వాత ఒక్కో స్టెప్‌తో ఫోన్ యూజర్ వాట్సాప్ ద్వారా ఫోన్, కంప్యూటర్ను హ్యాక్ చేస్తుంటారు.