AIADMK: విజయ్‌కు మరింత పెరిగిన బలం.. మద్దతు ప్రకటించిన అన్నాడీఎంకే
AIADMK : తమిళనాడులో విజయ్ సర్కారుకు మరింత మద్దతు చేకూరింది. అన్నాడీఎంకేకు చెందిన షణ్ముగం వర్గం.. టీవీకే పార్టీకి మద్దతు ప్రకటించింది. తమ పార్టీని పునర్ నిర్మించాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే షణ్ముగం అన్నారు.
చెన్నై: తమిళనాడు అసెంబ్లీలో టీవీకే పార్టీకి మరింత బలం చేకూరింది. ఆ పార్టీ ముఖ్యనేత విజయ్ .. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా సీవీ షణ్ముగం నేతృత్వంలోని అన్నాడీఎంకే(AIADMK) వర్గం .. టీవీకేకు తమ మద్దతును ప్రకటించింది. దీంతో విజయ్ సర్కారు మరింత పటిష్టమైంది. అన్నాడీఎంకే పార్టీ గడిచిన కొన్ని దశాబ్ధాలుగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు షణ్ముగం చెప్పారు. మూడు సార్లు డీఎంకే, ఓసారి టీవీకే చేతిలో ఓడిందన్నారు. పార్టీని పునర్ నిర్మించాల్సిన అవసరం ఉందని, అన్నాడీఎంకే భవిష్యత్తుపై సమాలోచనలు చేయాలని ఇటీవల మీడియాతో తెలిపారు.
టీవీకేకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించామని, డీఎంకేకు వ్యతిరేకంగా తమ పార్టీని స్థాపించామని, 53 ఏళ్లుగా డీఎంకేకు వ్యతిరేకంగా తాము రాజకీయం చేశామని, డీఎంకేతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన కూడా చేశౄమని, కానీ మెజారిటీ సభ్యులు దాన్ని తిరస్కరించారని, డీఎంకేతో కలిసి పనిచేస్తే, అన్నాడీఎంకే సమసిపోతుందన్న అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయని, ప్రస్తుత దశలో తమకు ఎటువంటి కూటమి లేదని, ఇప్పుడు పార్టీ పునర్ నిర్మాణంపై ఫోకస్ పెట్టాలని భావిస్తున్నామని, ఈ నేపథ్యంలో టీవీకేకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించినట్లు షణ్ముగం తెలిపారు. కానీ పార్టీని చీల్చాలన్న ఉద్దేశం తనకు లేదన్నారు.
అయితే విజయ్‌తో పొత్తు పెట్టుకునేందుకు అన్నాడీఎంకే సీనియర్ నేత, మాజీ సీఎం పళనిస్వామి వ్యతిరేకించారు. తాజా ఎన్నికల్లో అన్నాడీఎంకేకు 47 సీట్లు వచ్చిన విషయం తెలిసిందే.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Palamuru Lift | ఫలించిన సింగిరెడ్డి వ్యూహం..ఎట్టకేలకు పాలమూరు లిఫ్ట్ ప్రారంభం
Akhilesh Yadav | అఖిలేష్ యాదవ్‌కు షాక్.. బీజేపీలో చేరిన ఎస్పీ రెబల్ ఎమ్మెల్యేలు
Prabhas | ‘కల్కి 2’ సెట్స్‌లోకి రెబల్ స్టార్ ప్రభాస్.. త్వరలో ప్రారంభం కానున్న భారీ షెడ్యూల్!
రైతుల వ్యథలు పట్టించుకోని ప్రభుత్వం : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
‘రేషన్ షాపుల ద్వారా 14 రకాల నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలి’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

