న్యూఢిల్లీ, జూలై 28: ‘సీయూఈటీ-యూజీ’-2024 ఫలితాలు ఎట్టకేలకు వెలువడ్డాయి. దీంతో దేశంలోని 283 వర్సిటీల్లో యూజీ కోర్సుల అడ్మిషన్లకు మార్గం సుగమమైంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ జారీచేసే స్కోర్ కార్డ్ ఆధారంగా ఆయా వర్సిటీలు మెరిట్ జాబితాను రూపొందిస్తాయి. దీని ప్రకారం విద్యార్థుల అడ్మిషన్ కౌన్సెలింగ్ సెషన్స్ చేపడతాయి. ఈసారి బిజినెస్ స్టడీస్ సబ్జెక్ట్‌లో 8,024 మంది, పొలిటికల్ సైన్స్‌లో 5,141 మంది, హిస్టరీలో 2,520 మంది, ఇంగ్లిష్‌లో 1,683 మంది, సైకాలజీలో 1,602 మంది విద్యార్థులు పూర్తి మార్కులు సాధించారు. ఇక జనరల్ టెస్ట్‌కు 7.09 లక్షల మంది విద్యార్థులు హాజరుకాగా, ఒక్కరు మాత్రమే ఫుల్ మార్కులు అందుకున్నారు. గణితంలో ఐదుగురు, తెలుగు, ఫ్రెంచ్, జపనీస్, రష్యన్ లాంగ్వేజ్ సబ్జెక్ట్‌లో ఒక్కొక్కరు పూర్తి మార్కులు సాధించారు. షెడ్యూల్ ప్రకారం జూన్ 30న పరీక్ష ఫలితాలు వెలువడాల్సింది.