న్యూఢిల్లీ, జూలై 4 : దేశంలోని వివిధ కేంద్ర విద్యాలయాలు, విద్యాసంస్థల్లో డిగ్రీ కోర్సుల్లో ప్రవేశానికి దేశవ్యాప్తంగా నిర్వహించిన సీయూఈటీ-యూజీ ఉమ్మడి ప్రవేశపరీక్ష ఫలితాలు విడుదల య్యాయి. ఒక అభ్యర్థి నాలుగు సబ్జెక్టులలో 100 పర్సంటైల్ సాధించినట్టు పరీక్షల నిర్వహణ సంస్థ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ప్రకటించింది. అలాగే 17 మంది మూడు సబ్జెక్టులలో 100 పర్సంటైల్ సాధించారని తెలిపింది.
వివిధ సబ్జెక్టుల కాంబినేషన్‌కు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) విధానంలో నిర్వహించిన ఈ ఉమ్మడి ప్రవేశ పరీక్షలకు 13.54 లక్షల మంది హాజరయ్యారని ఎన్టీఏ వెల్లడించింది. మొత్తం విద్యార్థుల్లో 150 మంది రెండు సబ్జెక్టులలో, 2,679 మంది ఒక్క సబ్జెక్టులో 100 పర్సంటైల్ సాధించారన్నారు. దేశంలోని 300 నగరాల్లో పరీక్ష నిర్వహించామని, ఇందులో 15 నగరాలు విదేశాల్లో కూడా ఉన్నాయని ఎన్టీఏ తెలియజేసింది.