Militant Ambush | మణిపూర్‌లోని జిరిబామ్ జిల్లాలో ఆదివారం జాయింట్ పెట్రోలింగ్‌పై అనుమానిత ఉగ్రవాదులు మెరుపుదాడి చేశారు. ఈ ఘటనలో సీఆర్పీఎఫ్ జవాన్ మరణించగా.. ఇద్దరు మణిపూర్ పోలీస్ అధికారులతో సహా ముగ్గురు భద్రతా సిబ్బంది గాయపడ్డారని పోలీసులు తెలిపారు. మోర్బంగ్ గ్రామంలో దాడి జరిగిందని.. అక్కడ ఉగ్రవాదులు పెట్రోలింగ్ పార్టీపై కొండ ప్రాంతం నుంచి కాల్పులు జరిపారు. సీఆర్పీఎఫ్ సైనికులు పెట్రోలింగ్ సమయంలో యూఎస్వీలో ఉండగా.. వాహనంపై బుల్లెట్ల వర్షం కురిపించారు.
ఆ తర్వాత భద్రతా సిబ్బంది కోలుకొని తిరిగి కాల్పులు జరుపడంతో ఉగ్రవాదులు అడవిలోకి పారిపోయారు. ప్రస్తుతం ఉగ్రవాదుల కోసం వేట కొనసాగుతున్నది. ఆ ప్రాంతంలో అదనపు బలగాలను మోహరించారు. గాయపడిన సిబ్బందిని ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. భద్రతా బలగాలపై దాడి గత ఐదువారాల్లో ఇది రెండోది. జూన్ 10న కాంగ్పోక్పి జిల్లాలో సీఎం ఎన్ బీరెన్ సింగ్ ముందస్తు భద్రతా కాన్వాయ్‌పై ఉగ్రవాదులు దాడి పాల్పడ్డారు. ఈ ఘటనలో భద్రతా సిబ్బంది గాయపడ్డారు. జిరిబామ్ జిల్లాలో జూన్6న రైతు సోయిబామ్ శరత్‌కుమార్ సింగ్ హత్యతో సహా ఇటీవలి హింసాత్మక సంఘటనలు పెరుగుతున్నాయి.