Rajesh Agrawal : ఢిల్లీ (Delhil) లోని ఎర్రకోట (Red fort) సమీపంలో బాంబు పేలుడు జరిగిన జరిగిన ప్రదేశాన్ని సీఆర్పీఎఫ్ ఐజీ (CRPF IG) రాజేష్ అగర్వాల్ (Rajesh Agarwal) పరిశీలించారు. పేలుడుకు సంబంధించిన వివరాలను సంబంధిత అధికారులను, పోలీసులను అడిగి తెలుసుకున్నారు. బాంబు పేలుడుకు సంబంధించిన అధికారిక సమాచారాన్ని ఢిల్లీ పోలీసులు ఇస్తారని చెప్పారు.
పేలుడు జరిగిన ప్రదేశంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేసే పనిలో తాము ఉన్నామని రాజేష్ అగర్వాల్ తెలిపారు. ఢిల్లీ పోలీసులు తమ నుంచి ఎలాంటి సాయం కోరినా సహకరించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఘటనకు సంబంధించి పోలీసుల నుంచి తమకు అధికారిక సమాచారం రావాల్సి ఉందని అన్నారు.
కాగా సోమవారం రాత్రి 7 గంటల సమయంలో జరిగిన బాంబు పేలుడులో మృతుల సంఖ్య 12కు చేరింది. ఎనిమిది మంది స్పాట్లో మరణించగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనకు బాధ్యులు ఎవరనేదానిపై అన్ని కోణాల్లో దర్యాప్తు సాగుతోంది.
#WATCH | Delhi | IG CRPF Rajesh Agrawal arrives at Delhi Red Fort blast site. He says, “Delhi Police will give official information on the blast. CRPF provides any required assistance to the Delhi Police. Our exercise (for security enhancement) is going on.” pic.twitter.com/NtZvCVeuHe
— ANI (@ANI) November 11, 2025
#WATCH | IG CRPF Rajesh Agrawal arrives at Delhi Red Fort blast site
He says, “Delhi Police will give official information. CRPF provides any required assistance to the Delhi Police.” pic.twitter.com/ggQ0UHFZ7s
— ANI (@ANI) November 11, 2025