Mamata Banerjee: సీఆర్పీఎఫ్, పోల్ అబ్జర్వర్లపై దీదీ ఆరోపణలు
Mamata Banerjee: కేంద్ర భద్రతా బలగాలు, పోల్ అబ్జర్వర్లపై బెంగాల్ సీఎం దీదీ తీవ్ర ఆరోపణలు చేశారు. భబానిపుర్లో పోలింగ్ బూత్‌లను సందర్శించిన తర్వాత ఆమె మీడియాతో మాట్లాడారు. మంగళవారం రాత్రి నుంచే రాష్ట్రంలో పరిస్థితి ఉద్రిక్తంగా ఉన్నదని, టీఎంసీ కార్యకర్తలను అధికారులు బెదిరిస్తున్నట్లు ఆమె ఆరోపించారు.
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో ఇవాళ 142 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగుతున్నది. ఆ రాష్ట్ర సీఎం, టీఎంసీ నేత మమతా బెనర్జీ(Mamata Banerjee) .. భబానిపుర్ నుంచి పోటీ చేస్తున్నారు. అయితే ఇవాళ ఆమె కేంద్ర భద్రతా బలగాలు, పోల్ అబ్జర్వర్లపై తీవ్ర ఆరోపణలు చేశారు. భబానిపుర్లో పోలింగ్ బూత్‌లను సందర్శించిన తర్వాత ఆమె మీడియాతో మాట్లాడారు. మంగళవారం రాత్రి నుంచే రాష్ట్రంలో పరిస్థితి ఉద్రిక్తంగా ఉన్నదని, టీఎంసీ కార్యకర్తలను అధికారులు బెదిరిస్తున్నట్లు ఆమె ఆరోపించారు. అనేక ప్రాంతాల్లో తమ పార్టీకి చెందిన పోస్టర్లను తొలగించినట్లు ఆమె చెప్పారు.
సీఆర్పీఎఫ్ సిబ్బందితో పాటు కేంద్ర బలగాలు, ఇతర పోల్ అబ్జర్వర్లు.. కోర్టు ఇచ్చిన ఆదేశాలను పాటించడం లేదని విమర్శించారు. ఎటువంటి కారణం లేకుండానే వివిధ ప్రాంతాల్లో పార్టీ వర్కర్లను తీసుకెళ్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియను డిస్టర్బ్ చేస్తున్నట్లు ఆమె ఆరోపించారు. ఓ ముఖ్యమంత్రిగా కాకుండా ఓ సాధారణ అభ్యర్థిగా పోలింగ్ స్టేషన్లను విజిట్ చేస్తున్నట్లు చెప్పారు. వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో తనతో పాటు అభిషేక్ బెనర్జీ కూడా రాత్రంతా మెళకువతో ఉన్నట్లు తెలిపారు. అసిమ్ బాసు అనే టీఎంసీ ప్రతినిధిని వేధించినట్లు ఆమె పేర్కొన్నారు.
సెకండ్ ఫేస్‌లో 142 సీట్లకు ఓటింగ్ జరుగుతోంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ స్టార్ట్ అయ్యింది. సాయంత్రం 6 వరకు పోలింగ్ కొనసాగనున్నది. సుమారు 3.22 కోట్ల మంది ఓటర్లు తమ హక్కును వినియోగించుకోనున్నారు. రెండో ఫేస్‌లో 1448 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇవాళ ఉదయం 9 గంటల వరకు 18.39 శాతం పోలింగ్ నమోదు అయ్యింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTRs Meeting | కేటీఆర్ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
Modi Cabinet | రైల్వే ఉద్యోగులకు మోదీ క్యాబినెట్ శుభవార్త.. 78 రోజుల బోనస్ ప్రకటన
మేగ్యతండాలో మహిళా శక్తి భవనం పరిశీలన
డిండి ఎత్తిపోతల రద్దు చేస్తే పెద్ద ఎత్తున ఉద్యమం : మాజీ ఎమ్మెల్యే కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
Kethireddy Vasudeva reddy | దొర అహంకారంతో వ్యవహరిస్తున్న బల్మూరి వెంకట్ : డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

