శ్రీనగర్ : పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్ జాతీయులు, వలసదారులను స్వదేశానికి పంపేందుకు కేంద్రం చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కశ్మీర్ అధికార యంత్రాంగం 60 మంది పాకిస్థానీయులతో సిద్ధం చేసిన జాబితాలో, శౌర్యచక్ర అందుకున్న ఓ కానిస్టేబుల్ తల్లి కూడా ఉండటం చర్చనీయాంశమైంది. వివిధ ప్రాంతాల్లో ఉన్న 60 మందిని బస్సుల్లో పంజాబ్‌కు పంపారు. అక్కడ వీళ్లను వాఘా సరిహద్దులో పాక్ అధికారులకు అప్పగించనున్నారు. అలాగే సీఆర్పీఎఫ్ జవాన్ భార్య, పాకిస్థానీయురాలు మినాల్ ఖాన్ కూడా ఈ జాబితాలో ఉన్నట్టు అధికారులు తెలిపారు.