న్యూఢిల్లీ: సీఆర్పీఎఫ్ డీఐజీ ఖజన్ సింగ్ను కేంద్ర ప్రభుత్వం సర్వీస్ నుంచి డిస్మిస్ చేసింది. మహిళా సిబ్బంది ఆయనపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేయడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్రపతి కార్యాలయం మే 30న ఆదేశాలు జారీ చేసినట్టు సీఆర్పీఎఫ్ అధికారులు తెలిపారు.