న్యూఢిల్లీ: రద్దు అయిన రూ.500, రూ.1000 కరెన్సీ నోట్లను భారీ మొత్తంలో సీజ్ చేశారు. ఢిల్లీలోని వాజిర్పుర్ ఏరియాలో డిమానిటైజ్ నోట్లతో ఉన్న బ్యాగులను స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా నగదు సరఫరా జరుగుతున్నట్లు ఇన్ఫర్మేషన్ రావడంతో పోలీసులు దాడులు చేశారు. ఆ తనిఖీల్లో రూ.500, రూ.1000 రద్దు అయిన నోట్లతో నిండి ఉన్న కొన్ని బ్యాగులను స్వాధీనం చేసుకున్నారు. 2016, నవంబర్లో కేంద్ర ప్రభుత్వం నోట్ల రద్దు ప్రకటించిన విషయం తెలిసిందే. రద్దైన నోట్లతో ఉన్న బ్యాగులు కలిగి ఉన్న కొందరు వ్యక్తులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ నగదును ట్రాన్స్పోర్టు చేస్తున్న రెండు వాహనాలను కూడా సీజ్ చేశారు. కరెన్సీ నోట్లు ఎక్కడ నుంచి వచ్చాయన్న కోణంలో దర్యాప్తు చేపడుతున్నారు. రద్దు అయిన నోట్లకు సంబంధించిన నెట్వర్క్ గురించి ఆఫీసర్లు ఆరా తీస్తున్నారు.