Crorepati’s Wife | ఆమె కోటీశ్వరుడికి భార్య.. కానీ తన కంటే 13 ఏండ్ల చిన్నవాడైన యువకుడు.. ఆటో రిక్షా డ్రైవర్‌తో వెళ్లిపోయిన ఘటన మధ్యప్రదేశ్‌లో వెలుగు చూసింది. ఇండోర్‌లోని ఖాజ్రానా ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇంట్లో ఉన్న రూ.47 లక్షల నగదుతోపాటు తన భార్య కనిపించడం లేదని ఆమె భర్త పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన బయట పడింది.
పోలీసుల ప్రాథమిక దర్యాప్తు ప్రకారం ఈ నెల 13 నుంచి ఆమె కనిపించడం లేదు. ఇండోర్ పోలీసులు సదరు మహిళ కోసం.. ఆ ఆటో రిక్షా డ్రైవర్ కోసం గాలిస్తున్నారు. ఇంతకుముందు ఆ యువకుడి ఆటో రిక్షాలోనే ఆమె తరుచుగా బయటకు వెళ్లేదని తెలుస్తోంది. ఖండ్వా,ఆ జావ్రా, ఉజ్జయిన్, రత్లాం తదితర ప్రాంతాల్లో వీరి ఆచూకీ కోసం గాలిస్తున్నారు.
ఆ యువకుడి పేరు ఇమ్రాన్ అని, అతడి వయస్సు 32 ఏండ్లని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఇక ఇమ్రాన్ స్నేహితుడి ఇంట్లో రూ.33 లక్షల నగదు పోలీసులు రికవరీ చేశారు. కానీ సదరు మహిళ, ఆటో డ్రైవర్ ఇమ్రాన్ ఆచూకీ మాత్రం తెలియరాలేదు. ఆ మహిళ భర్త పేరు మీద కోట్ల విలువ చేసే భూములు ఉన్నాయని వార్తలొస్తున్నాయి.
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
సూడాన్‌లో సైనిక తిరుగుబాటు, దేశవ్యాప్తంగా ఆందోళనలు, ఏడుగురు మృతి
మీ ఎజెండాతో పార్టీకి నష్టం కలిగించకండి: సోనియాగాంధీ
శీతాకాలంలో వేధించే అలర్జీలు.. ఇలా చెక్ పొట్టొచ్చు!
ఈ పండు రోజూ తింటే హార్ట్ అటాక్ రాదంట..! ఆక్స్ఫర్డ్ పరిశోధకుల వెల్లడి
గాయాల గురించి చెప్పే స్మార్ట్ బ్యాండేజ్ వచ్చేసింది..!
హైబీపీ ఉన్నదని తెలిపే లక్షణాలివే..!
ఈ చెక్క కత్తి .. స్టీల్ కత్తి కంటే వెరీ షార్ప్ గురూ!