NCRB | పిల్లలపై పెరిగిన నేరాలు..మహిళలపై నేరాలు దేశ రాజధాని ఢిల్లీలోనే ఎక్కువ
అంతకుమునుపటి ఏడాదితో పోల్చితే 2024లో దేశవ్యాప్తంగా పిల్లలపై నేరాలు భారీగా పెరిగాయని ‘ఎన్సీఆర్బీ’ (జాతీయ నేర గణాంకాల బ్యూరో) తాజాగా వెల్లడించింది.
- 2024లో 75,105 కిడ్నాప్‌లు
- మహిళలపై నేరాలు దేశ రాజధాని ఢిల్లీలోనే ఎక్కువ
- ఎన్సీఆర్బీ తాజా నివేదిక
న్యూఢిల్లీ, మే 6: అంతకుమునుపటి ఏడాదితో పోల్చితే 2024లో దేశవ్యాప్తంగా పిల్లలపై నేరాలు భారీగా పెరిగాయని ‘ఎన్సీఆర్బీ’ (జాతీయ నేర గణాంకాల బ్యూరో) తాజాగా వెల్లడించింది. 2024లో పిల్లలపై నేరాలు 5.9 శాతం మేర పెరిగాయని, ఇందులో 75,108 కిడ్నాప్‌లు ఉన్నాయని తెలిపింది. పిల్లలపై జరిగిన లైంగిక నేరాల్లో 69,191 కేసులు నమోదయ్యాయి. దేశ రాజధాని ఢిల్లీలో మహిళలపై నేరాలు అత్యధికంగా జరుగుతున్నాయని ‘ఎన్సీఆర్బీ’ పేర్కొన్నది. తాజా గణాంకాల ప్రకారం, మహిళలపై నేరాలకు సంబంధించి దేశంలోని 19 ప్రధాన నగరాల్లో ఢిల్లీ మొదటిస్థానంలో నిలిచింది. ఇక్కడ ఒక్క 2024 ఏడాదిలో 13,396 కేసులు నమోదైనట్టు నివేదిక తెలిపింది.
కాగా, దేశవ్యాప్తంగా క్రైం రేట్ 6 శాతం తగ్గిందని పేర్కొన్న నివేదిక, దేశంలో 2024లో 27,049 హత్యలు జరిగినట్టు పేర్కొన్నది. మొత్తం 96,079 మంది కిడ్నాప్‌కు గురికాగా, ఇందులో 70,000కుపైగా బాధితులు మహిళలే ఉన్నారు. సైబర్‌నేరాలు అత్యధికంగా చోటుచేసుకున్న నగరంగా బెంగళూర్ మొదటిస్థానంలో నిలిచింది. ఇక్కడ 2024లో 17,561 సైబర్ నేరాలు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా 1.01,928 కేసులు నమోదైనట్టు నివేదిక పేర్కొన్నది. మహిళలపై నేరాల రేటు విషయంలో దేశం మొత్తం మీద జైపూర్, ఇండోర్, లక్నో మొదటి మూడు స్థానాల్లో నిలువగా, ఢిల్లీ నాలుగో స్థానంలో ఉంది. 2024 ఏడాదికి సంబంధించి ఢిల్లీలో నేరాల రేటు 176.8గా నివేదిక పేర్కొన్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
కేసీఆర్‌పై ‘వెలుగు’ దుష్ప్రచారం.. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలి: జర్మనీ బీఆర్ఎస్ డిమాండ్
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్‌ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

