Crime news | మద్యం మత్తులో కిరాతకం.. భార్య, ఇద్దరు బిడ్డలను నరికి చంపిన వైనం..!
Crime news | మద్యం మత్తులో ఓ వ్యక్తి అత్యంత కిరాతకానికి పాల్పడ్డాడు. భార్యను, ఇద్దరు బిడ్డలను దారుణంగా గొడ్డలితో నరికి చంపాడు. జార్ఖండ్ రాష్ట్రంలోని పశ్చిమ సింగ్భూమ్ జిల్లాలో సోమవారం అర్ధరాత్రి (తెల్లవారితే మంగళవారం) ఈ ఘోరమైన ఘటన చోటుచేసుకుంది. మూడు హత్యలు చేసి నిందితుడు మృతదేహాల పక్కనే పడుకున్నాడు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
Crime news : మద్యం మత్తులో ఓ వ్యక్తి అత్యంత కిరాతకానికి పాల్పడ్డాడు. భార్యను, ఇద్దరు బిడ్డలను దారుణంగా గొడ్డలితో నరికి చంపాడు. జార్ఖండ్ రాష్ట్రంలోని పశ్చిమ సింగ్భూమ్ జిల్లాలో సోమవారం అర్ధరాత్రి (తెల్లవారితే మంగళవారం) ఈ ఘోరమైన ఘటన చోటుచేసుకుంది. మూడు హత్యలు చేసి నిందితుడు మృతదేహాల పక్కనే పడుకున్నాడు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. జార్ఖండ్ రాష్ట్రం పశ్చిమ సింగ్భూమ్ జిల్లా ముఫాసిల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లుద్రాబాసా గ్రామంలో గురుచరణ్ పాడియా అనే వ్యక్తి భార్య.. ఐదేళ్లు, ఏడాది వయస్సున్న ఇద్దరు బిడ్డలతో కలిసి నివాసం ఉంటున్నాడు. అయితే గురుచరణ్ పాడియా మద్యానికి బానిసయ్యాడు. రోజూ తప్పతాగి వచ్చి భార్య జానోతో గొడవపడేవాడు. ఈ క్రమంలో సోమవారం కూడా పూటుగా మద్యం సేవించి అర్ధరాత్రి 2.30 గంటలకు ఇంటికి చేరుకున్నాడు.
వచ్చీ రావడంతోనే భార్యతో గొడవకు దిగాడు. తాగి వచ్చి గోల చేస్తున్నావంటూ భార్య కూడా ఎదురు తిరగడంతో గొడవ మరింత పెద్దదైంది. దాంతో మద్యం మత్తులో ఉన్న గురుచరణ్ ఇంట్లోని గొడ్డలితో భార్యను నరికేశాడు. గొడవ కారణంగా నిద్రలేచిన పెద్ద బిడ్డ.. తండ్రి తన కళ్లముందే తల్లిని నరికేయడంతో భయంతో గడగడలాడుతూ ఏడవడం మొదలుపెట్టింది. దాంతో గురుచరణ్ అదే గొడ్డలితో బిడ్డను కూడా నరికేశాడు. ఆపై మరో గదిలో నిద్రలో ఉన్న ఏడాది బిడ్డను కూడా నరికి చంపాడు.
మూడు హత్యలు చేసిన అనంతరం హాయిగా మృతదేహాల పక్కనే నిద్రపోయాడు. అయితే అప్పటిదాకా గొడవ జరిగిన ఇంట్లో ఒక్కసారిగా నిశ్శబ్ధం చోటుచేసుకోవడంతో ఏదో జరిగిందని అనుమానించిన ఇరుగుపొరుగు లోపలికి వెళ్లి చూడగా హృదయవిదారక దృశ్యం కంటపడింది. భార్య, ఇద్దరు బిడ్డలు రక్తపు మడుగులో పడివుండగా గురుచరణ్ హాయిగా నిద్రపోతూ కనిపించాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటన స్థలానికి చేరుకున్నారు.
ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టానికి పంపించారు. నిందితుడు గురుచరణ్‌ను అరెస్ట్ చేశారు. బుధవారం గురుచరణ్‌ను కోర్టులో హాజరుపర్చనున్నట్లు పోలీసులు తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

