న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఇవాళ ఉదయాన్నే ఓ విషాద ఘటన చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న ఒక ఫ్లైవోవర్ కుప్పకూలడంతో.. ఆ ఫ్లైవోవర్ కింద విధుల్లో ఉన్న క్రేన్ ఆపరేటర్ దుర్మరణం పాలయ్యాడు. ఫ్లైవోవర్లో కొంత భాగం కూలిపోయి క్రేన్ పైనే పడిపోవడంతో అతను అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
సామల్ఖా ఏరియా సమీపంలో జాతీయ రహదారి 48పై ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సామల్ఖా సమీపంలో ద్వారకా ఎక్స్ప్రెస్ వేను అనుసంధానం చేస్తూ ఈ ఫ్లైవోవర్ను నిర్మిస్తున్నారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.