కోల్‌కతా: మానవ అక్రమ రవాణా ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. బార్లు, హోటల్స్‌లో సెక్స్ రాకెట్ నిర్వహిస్తున్నట్లు దర్యాప్తులో తెలుసుకున్నారు. కీలక నిందితులను అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో కోటికిపైగా డబ్బు, రెండు లగ్జరీ కార్లను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు స్వాధీనం చేసుకున్నారు. (Human Trafficking Racket) పశ్చిమ బెంగాల్లో ఈ సంఘటన జరిగింది. మనీలాండరింగ్ దర్యాప్తులో భాగంగా ఈడీ అధికారులు ఏకకాలంలో దాడులు చేశారు. కోల్‌కతా, సిలిగురి, ఉత్తర 24 పరగణాల జిల్లాలోని బిధాన్నగర్లో ఎనిమిది ప్రాంగణాలను తనిఖీ చేశారు. రూ.1.01 కోట్లకు పైగా నగదు, రెండు లగ్జరీ కార్లైన ల్యాండ్ రోవర్ డిఫెండర్, జాగ్వార్, డిజిటల్ పరికరాలు, ఆస్తి పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. అక్రమ నిధుల కోసం వినియోగించిన పలు బ్యాంకు ఖాతాలను గుర్తించారు.
కాగా, మానవ అక్రమ రవాణాతో పాటు సెక్స్ రాకెట్ నిర్వహిస్తున్నట్లు అధికారుల దర్యాప్తులో తెలిసింది. హోటల్స్, డ్యాన్స్ బార్స్‌లో చట్టవిరుద్ధ కార్యకలాపాలకు సంబంధించిన చెల్లింపుల కోసం ‘ప్లాస్టిక్ నోట్లను’ కరెన్సీగా ఉపయోగిస్తున్నట్లు ఈడీ అధికారులు గుర్తించారు. ఉపాధి కల్పిస్తామన్న తప్పుడు హామీలతో మహిళలను అక్రమంగా తరలించి వారిని వ్యభిచార రొంపిలోకి దించుతున్నట్లు దర్యాప్తులో తెలుసుకున్నారు.
మరోవైపు నిందితులు జగ్జిత్ సింగ్, అజ్మల్ సిద్ధిఖీ, బిష్ణు ముంద్రా, వారి సహచరులపై పోలీసులు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఈ కేసుల ఆధారంగా మనీలాండరింగ్ కోణంలో ఈడీ దర్యాప్తు చేసింది. నిందితుల నియంత్రణలో ఉన్న బహుళ కంపెనీల ద్వారా మనీ లాండరింగ్ జరిగినట్లు ఈడీ అధికారులు ఆరోపించారు.
Also Read:
mock slips dumped in Bihar | బీహార్‌లో పోల్ స్లిప్స్ రోడ్డుపై పారవేత.. ఎన్నికల అధికారి సస్పెండ్
Scooter Fined ‘Rs 21 Lakh | హెల్మెట్ ధరించనందుకు.. రూ.21 లక్షల జరిమానా
Watch: బెంగళూరు జైలులో ఇదీ పరిస్థితి.. ఫోన్లు మాట్లాడుతూ, టీవీ చూస్తున్న రేపిస్టులు, నేరస్తులు