న్యూఢిల్లీ, ఆగస్టు 19: సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. తీవ్ర జ్వరంతో బాధపడుతున్న ఆయన్ని సోమవారం ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేర్చారు. ఏచూరి గత కొంతకాలంగా నిమోనియాతో బాధపడుతున్నారని, ప్రస్తుతం ఆయన్ని దవాఖానలోని అత్యవసర విభాగంలో చేర్చామని ఎయిమ్స్ వర్గాలు తెలిపాయి.
వైద్య పరీక్షల నిమిత్తం ఎయిమ్స్‌కు వచ్చిన ఏచూరి, నిమోనియా తగ్గకపోవటంతో దవాఖానలో చేరారని పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందన్నారు. కొద్ది రోజుల క్రితమే ఏచూరి కంటి శుక్లాల ఆపరేషన్ చేయించుకున్నారు.