Annie Raja : బెంగాల్ ప్రభుత్వం రాష్ట్ర అసెంబ్లీలో ఆమోదించిన లైంగిక దాడి వ్యతిరేక బిల్లుపై సీపీఐ నేత అన్నీ రాజా బుధవారం స్పందించారు. చట్టాలను రూపొందించినా వాటిని పకడ్బందీగా అమలు చేయడమే మన దేశంలో ప్రధాన సమస్యని స్పష్టం చేశారు. భారత పార్లమెంట్ మహిళల గౌరవాన్ని కాపాడేందుకు ఎన్నో చట్టాలను ఆమోదించిందని గుర్తుచేశారు. మీడియాలో ఏ అంశం ప్రధానంగా వెలుగుచూసినా ఆపై ప్రజాగ్రహం వెల్లువెత్తితే మనం కొత్త చట్టాలను చేయడమో, ఉన్న చట్టాలకు సవరణ చేయడమో చూస్తుంటామని చెప్పారు.
చట్టాలను సరిగ్గా అమలు చేయకపోవడమే సమస్య అని ఆమె పేర్కొన్నారు. చట్టాలను సరిగ్గా అమలు చేసేందుకు అవసరమైన బడ్జెట్ కేటాయింపులను రాష్ట్రాలకు చేపట్టకపోవడం మరో ప్రధాన అవరోధమని అన్నారు. కాగా, హత్యాచార కేసులో నిందితులకు మరణశిక్ష విధించేలా కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు. లైంగిక దాడి వ్యతిరేక బిల్లును బెంగాల్ అసెంబ్లీ ఆమోదించింది. దీనికి అపరాజిత బిల్లు అని పేరు పెట్టారు. లైంగిక దాడికి పాల్పడిన వారికి జీవితఖైదు విధించేలా చట్టాన్ని తీసుకొచ్చారు.
లైంగిక దాడి కేసుల్లో దోషులకు 10 రోజుల్లో శిక్షలు పడేలా ఈ బిల్లును తీసుకొచ్చారు. బెంగాల్ అసెంబ్లీలో అపరాజిత బిల్లుకు బీజేపీ కూడా మద్దతు తెలిపింది. లైంగిక దాడి కేసుల్లో దోషులకు కఠినశిక్షలు అమలు చేయడంలో బెంగాల్ దేశానికి ఆదర్శంగా నిలుస్తుందన్నారు మమత బెనర్జీ . బీజేపీ పాలిత రాష్ట్రాల్లో లైంగిక దాడులకు పాల్పడే నిందితులు స్వేచ్చగా తిరుగుతున్నారని దీదీ ఆరోపించారు. యూపీలో హథ్రస్ , ఉన్నావ్ ఘటనలను ఆమె ప్రస్తావించారు. ఇక బెంగాల్ గవర్నర్ అపరాజిత బిల్లును వెంటనే ఆమోదించాలని బెంగాల్ సీఎం డిమాండ్ చేశారు.
Read More :
Nitin Gadkari: స్టెయిన్లెస్ స్టీల్ వాడి ఉంటే.. శివాజీ విగ్రహం కూలేది కాదు: నితిన్ గడ్కరీ