న్యూఢిల్లీ: తమిళనాడులోని మక్కల్ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు, ప్రముఖ సినీహీరో కమల్‌హాసన్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. అమెరికా పర్యటనకు వెళ్లివచ్చిన తర్వాత స్వల్పంగా దగ్గులేసిందని, దాంతో కరోనా నిర్ధారణ పరీక్షలు చేసుకోగా పాజిటివ్‌గా తేలిందని కమల్‌హాసన్ తెలిపారు. కరోనా వైరస్ సోకిందని తేలడంతో ఆస్పత్రిలోనే ఐసోలేషన్‌లో ఉన్నట్లు చెప్పారు.
తనకు కరోనా వైరస్ పాజిటివ్‌గా తేలడంతో ఇటీవల తనతో సన్నిహితంగా మెలిగిన పార్టీ కార్యకర్తలు, తన అభిమానులు కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. పాజిటివ్‌గా తేలితే కొన్నిరోజులపాటు ఐసోలేషన్‌లో ఉండాలని కోరారు.