లక్నో : ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న కేసుల మధ్య విదేశాల నుంచి వచ్చిన ఒకరికి కరోనా పాజిటివ్‌గా తేలింది. సదరు వ్యక్తి చైనా నుంచి రెండు రోజుల కిత్రం ఆగ్రాకు వచ్చాడు. ఓ ప్రైవేటు ల్యాబ్‌లో కరోనా పరీక్ష చేయించుకోగా.. పాజిటివ్‌గా తేలింది. ఆ తర్వాత ఆరోగ్యశాఖ బృందం సదరు యువకుడి ఇంటికి చేరుకొని.. వివరాలు ఆరా తీసింది. షాగంజ్ ప్రాంతానికి చెందిన 40 ఏళ్ల వ్యక్తి చైనాకు వెళ్లి.. ఈ నెల 23న ఆగ్రాకు తిరిగివచ్చాడు. ఆ తర్వాత ఓ ప్రైవేటు ల్యాబ్‌లో కొవిడ్ పరీక్షలు చేయించుకున్నాడు.
ఆదివారం కరోనా రిపోర్ట్‌గా పాజిటివ్‌గా తేలింది. దీంతో ప్రైవేట్ ల్యాబ్ ఆరోగ్యశాఖకు సమాచారం అందించారు. ఇద్దరు కాంటాక్టులకు సైతం పరీక్షలు నిర్వహించేందుకు ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్‌ను పంపారు. సదరు యువకుల కాంటాక్టులను గుర్తించి, పరీక్షలు చేయనున్నట్లు సీఎంవో డాక్టర్ అరుణ్ శ్రీవాస్తవ తెలిపారు. అయితే, అతనికి ఏ వేరియంట్ సోకిందనే విషయం తెలియరాలేదు. అతని నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపనున్నట్లు అధికారులు తెలిపారు.