న్యూఢిల్లీ: దేశంలో కొవిడ్-19 కేసుల సంఖ్య 5,755కు చేరింది. కేంద్ర ఆరోగ్య శాఖ వెబ్సైట్ ప్రకారం, శుక్రవారం నుంచి శనివారం వరకు కొత్తగా 391 కేసులు నమోదయ్యాయి. కేరళలో అత్యధికంగా 1,806 కేసులు ఉన్నాయి. ఆ తర్వాతి స్థానాల్లో గుజరాత్ (717), ఢిల్లీ (665), ప.బెంగాల్ (622) ఉన్నాయి. పస్తుతం కరోనా వైరస్ తీవ్రత అత్యంత స్వల్పంగా ఉందని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు తెలిపారు.