తిరువనంతపురం: కేరళలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతూనే ఉన్నది. ఇవాళ కూడా కొత్తగా 15,058 కొత్త కేసులు నమోదయ్యాయి. దాంతో ఆ రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 43,90,489కి పెరిగింది. కొత్తగా 99 మంది కరోనా బాధితులు మరణించడంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 22,650కి చేరింది. కేరళలో పాజిటివిటీ రేటు కూడా 16.39 శాతంగా ఉన్నది. ఇవాళ మొత్తం 91,885 మందికి కరోనా పరీక్షలు చేయగా 15,058 మందికి పాజిటివ్ వచ్చింది.
ఇక కొత్తగా 28,439 మంది కరోనా బాధితులు రికవరీ అయ్యారు. దాంతో మొత్తం రికవరీల సంఖ్య 41,58,504కు చేరింది. ప్రస్తుతం రికవరీలు, కరోనా మరణాలు పోను మరో 2,08,773 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మొత్తం 14 జిల్లాల్లో కరోనా ప్రభావం తీవ్రంగా ఉండగా కోజికోడ్ జిల్లాలో ఇవాళ అత్యధికంగా 1,800 కేసులు నమోదయ్యాయి.