న్యూఢిల్లీ : ఖలా మూవీలో షౌఖ్ సాంగ్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఓ జంట డ్యాన్స్ పెర్ఫామెన్స్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఆహ్లాదపరిచే సంగీతం, హృదయాన్ని మీటే సాహిత్యంతో ఈ ట్రాక్ అందరినీ అలరిస్తోంది. ఈ వైరల్ వీడియోను సారా సోని ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేశారు. ఈ క్లిప్‌లో అజయ్ నాయర్‌తో కలిసి సారా షౌఖ్ సాంగ్‌కు క్రేజీ మూమెంట్స్‌తో హోరెత్తించారు.
వీరిద్దరూ కనబరిచిన ఈజ్, స్టెప్స్‌లో గ్రేస్ కలిసి నెటిజన్లను వావ్ అనేలా చేసింది. చివరిగా ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి ఇలా షూట్ చేశామని పోస్ట్‌కు క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియోను ఆన్లైన్లో షేర్ చేసినప్పటి నుంచి 4 లక్షలకు పైగా వ్యూస్ లభించాయి. సోని, అజయ్ పెర్ఫామెన్స్‌కు ఇన్స్టాగ్రాం యూజర్లు ఫిదా అయ్యారు.
కామెంట్స్ సెక్షన్లో వారిపై ప్రశంసలు గుప్పించారు. ప్యూర్ టాలెంట్..ఫ్యాన్సీ దుస్తులు లేవు, ఫేక్ కెమిస్ట్రీ లేదు..మేకప్, డ్రామా మచ్చుకైనా లేవు, ప్లెయిన్ టాలెంట్ మాత్రమే కనిపించిందని ఓ యూజర్ రాసుకొచ్చారు.