Floods | గాంధీనగర్: గుజరాత్లో వచ్చిన భారీ వరదల్లో ఒక జంట కారులో చిక్కుకుపోయి ఎట్టకేలకు ప్రాణాలతో బయటపడింది. సబర్కాంత జిల్లాలో కరోల్ నది పొంగడంతో ఆదివారం వచ్చిన భారీ వరదల్లో ఒక వ్యక్తి తన భార్యతో కారులో చిక్కుకుపోయారు. వరద నీరు ముంచెత్తడంతో భార్యాభర్తలు ఎలాగోలా కారు టాప్‌పైకి చేరుకున్నారు. కారు మొత్తం మునిగిపోయి కేవలం టాప్ మాత్రమే బయటకు కన్పించింది.
అయితే రెండు గంటల పాటు అలా టాప్‌పైనే ఉన్నప్పటికీ వారు ఎలా ంటి ఆందోళన లేకుండా కూర్చోవడం స్థానికులను ఆశ్చర్యపరిచింది. ఎట్టకేలకు సహాయ బృందాలు వారిని రక్షించి సురక్షితంగా బయటకు తీసుకువచ్చాయి. తాము కారులో నదిని దాటుతుండగా హఠాత్తుగా పెరిగిన నదీ ప్రవాహంతో కారు 1.5 కి.మీ కొట్టుకుపోయిందని బాధితుడు సురేష్ మిస్త్రీ తెలిపారు.