Counting | పశ్చిమబెంగాల్లో కౌంటింగ్‌కు సర్వం సిద్ధం.. 11 జిల్లాల్లో హైఅలర్ట్
Counting | నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో సోమవారం ఓట్ల లెక్కింపు (Vote Counting) నేపథ్యంలో అధికారులు సర్వం సిద్ధం చేశారు. బెంగాల్లో కౌంటింగ్ ఏర్పాట్లపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ (Union Home Ministry) ఉన్నత స్థాయి భద్రతా సమీక్షా సమావేశం నిర్వహించింది. ఎన్నికల ఫలితాల సమయంలో హింస చెలరేగే అవకాశమున్న 11 జిల్లాలను అత్యంత సున్నితమైన ప్రాంతాలుగా గుర్తించింది.
Counting : నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో సోమవారం ఓట్ల లెక్కింపు (Vote Counting) నేపథ్యంలో అధికారులు సర్వం సిద్ధం చేశారు. బెంగాల్లో కౌంటింగ్ ఏర్పాట్లపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ (Union Home Ministry) ఉన్నత స్థాయి భద్రతా సమీక్షా సమావేశం నిర్వహించింది. ఎన్నికల ఫలితాల సమయంలో హింస చెలరేగే అవకాశమున్న 11 జిల్లాలను అత్యంత సున్నితమైన ప్రాంతాలుగా గుర్తించింది. ఆయా జిల్లాల్లో హై అలర్ట్ (High Alert) ప్రకటించి భద్రతను మరింత కట్టుదిట్టం చేసినట్లు వెల్లడించింది. ఈ జాబితాలో ముర్షిదాబాద్, ఉత్తర 24 పరగణాలు, దక్షిణ 24 పరగణాలు, కూచ్ బెహార్, మాల్దా, నాడియా, బీర్భూం, పశ్చిమ మేదినీపూర్, హుగ్లీ తదితర జిల్లాలు ఉన్నాయి.
ఎన్నికల ఫలితాలు వెలువడే సమయంలో ఎటువంటి హింస, అల్లర్లు జరగకుండా ఉండేందుకు అన్ని కేంద్ర, రాష్ట్ర ఏజెన్సీలను హై అలర్ట్‌లో ఉంచినట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 75 వేల మంది కేంద్ర పారామిలిటరీ దళాలను మోహరించినట్లు కేంద్ర హోంశాఖ అధికారులు పేర్కొన్నారు. బుల్లెట్లు, పేలుళ్లను తట్టుకోగల అధునాతన ‘మార్క్స్‌మ్యాన్’ సాయుధ వాహనాలను రంగంలోకి దించారు. బంగ్లాదేశ్‌ను ఆనుకుని ఉన్న సరిహద్దు జిల్లాల్లో అదనపు నిఘాను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే కంటెంట్‌ను వ్యాప్తి చేయకుండా అడ్డుకునేందుకు రాజకీయ పార్టీల సోషల్ మీడియా అకౌంట్లు, వ్యవస్థీకృత నెట్‌వర్క్‌లపై దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు.
రాష్ట్రంలోని పలు ముఖ్యమైన ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద ఎన్ఐఏ అధికారులు నిఘా ఉంచారు. ఇదిలావుంటే అధికారిక లెక్కల ప్రకారం.. 2011 ఎన్నికల సమయంలో కౌంటింగ్ సందర్భంగా 25 మంది ప్రాణాలు కోల్పోయారు. 2016 ఎన్నికల సందర్భంగా 30 మంది మృతిచెందగా.. 2021 అసెంబ్లీ ఎన్నికల సమయంలో అత్యధికంగా 58 మంది మరణించారు. మళ్లీ అటువంటి హింస జరగకుండా నివారించేందుకు ఈ కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
బోనస్ ప్రకటించినా సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు అందని నగదు
MP Helen Haines: కారుతో అటాక్.. గాయపడ్డ ఆస్ట్రేలియా ఎంపీ
Singireddy Niranjan Reddy | రేవంత్ అసమర్థతో హరిగోస పడుతున్న రైతాంగం : మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
Iron Rod Pierces Boy’s Mouth | ఆడుతూ కిందపడిన బాలుడు.. నోటిలోకి చొచ్చుకెళ్లిన ఇనుప కడ్డీ
Nishad Kumar: ఏషియన్ పారా గేమ్స్.. లాంగ్ జంప్‌లో నిషాద్ కుమార్‌కు స్వర్ణం
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

