గ్వాలియర్: కల్తీ దగ్గు మందు కారణంగా 24 మంది చిన్నారులు మరణించిన ఘటనను మరువకముందే బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లో మరో దారుణం వెలుగుచూసింది. పిల్లలకు వాడే యాంటీబయోటిక్ మందు బాటిల్లో క్రిములు కనిపించడం కలకలం రేపింది.
తన కుమారుడికి ఇచ్చిన అజిత్రోమైసిన్ సిరప్ బాటిల్లో పురుగులు కనిపించినట్లు ఓ మహిళ ఫిర్యాదు చేసినట్లు అధికారులు గురువారం తెలిపారు. గ్వాలియర్ జిల్లాలోని మొరార్ పట్టణంలో ఉన్న ప్రభుత్వ దవాఖానలో ఈ ఘటన జరిగింది.