శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
National - Feb 23, 2021 , 18:25:13

బాబా రాందేవ్‌కు షాక్‌ : పతంజలి కరోనిల్‌ విక్రయాలపై నిషేధం

బాబా రాందేవ్‌కు షాక్‌ : పతంజలి కరోనిల్‌ విక్రయాలపై నిషేధం

ముంబై : కరోనా వైరస్‌ నియంత్రణ కోసం బాబా రాందేవ్‌కు చెందిన పతంజలి అభివృద్ధి చేసిన కరోనిల్‌ ఔషధ విక్రయాలపై మహారాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించింది. డబ్ల్యూహెచ్‌ఓ, ఐఎంఏ వంటి ప్రతిష్టాత్మక ఆరోగ్య సంస్ధల అనుమతి లేకుండా కరోనిల్‌ విక్రయాలను మహారాష్ట్రలో అనుమతించమని హోంమంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌ స్పష్టం చేశారు. కరోనిల్‌ క్లినికల్‌ ట్రయల్స్‌పై ఐఎంఏ సందేహాలు లేవనెత్తడంతో పాటు కరోనా కట్టడి ఔషధం కోసం పతంజలి ఆయుర్వేదకు తాము ఎలాంటి సర్టిఫికెట్‌ ఇవ్వలేదని డబ్ల్యూహెచ్‌ఓ స్పష్టం చేసిందని అనిల్‌ దేశ్‌ముఖ్‌ ట్వీట్‌ చేశారు.

హడావిడిగా ఇద్దరు సీనియర్‌ కేంద్ర మంత్రుల సమక్షంలో డ్రగ్‌ను లాంఛ్‌ చేయడం సరైంది కాదని వ్యాఖ్యానించారు. కాగా డబ్ల్యూహెచ్‌ఓ సర్టిఫికేషన్‌పై పతంజలి ఆయుర్వేద అసత్యాలు ప్రచారం చేయడం పట్ల ఐఎంఏ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఔషధాన్ని స్వయంగా డాక్టర్‌ అయిన కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్‌ హర్షవర్ధన్‌ ప్రమోట్‌ చేయడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేసింది. 

VIDEOS

logo