గురువారం 28 మే 2020
National - May 07, 2020 , 21:34:43

జూన్‌-జూలైలో కరోనా విజృంభించే అవకాశాలు

జూన్‌-జూలైలో కరోనా విజృంభించే అవకాశాలు

న్యూఢిల్లీ: రానున్న రెండు నెలల్లో దేశంలో కరోనా వైరస్‌ మరింత తీవ్రరూపం దాల్చే అవకాశాలు ఉన్నాయని ఆలిండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌) డైరెక్టర్‌ డాక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా అంచనా వేశారు. ప్రస్తుతం దేశంలో నమోదవుతున్న కేసుల సరళి పరిశీలిస్తే రానున్న జూన్‌-జూలై నెలల్లో వైరస్‌ కేసులు అధికంగా నమోదయ్యేట్టుగా కనిపిస్తున్నదని చెప్పారు. లాక్‌డౌన్‌ కారణంగా వివిధ దేశాలతో పోలిస్తే మన దేశంలో కేసుల సంఖ్య గణనీయంగా తగ్గిందని చెప్పారు. వైరస్‌ ప్రభావం ఇంకెంత కాలం  ఉంటుందో చెప్పడం కష్టమన్నారు. హాట్‌స్పాట్‌ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెడితే కేసుల సంఖ్యను తగ్గించవచ్చునన్నారు. 


logo