గురువారం 09 జూలై 2020
National - Jun 19, 2020 , 12:17:57

మ‌హారాష్ట్ర‌లో క‌రోనా క‌ల్లోలం!

మ‌హారాష్ట్ర‌లో క‌రోనా క‌ల్లోలం!

ముంబై: మ‌హారాష్ట్ర‌లో క‌రోనా క‌ల్లోలం సృష్టిస్తున్న‌ది. రోజురోజుకు కొత్త కేసులు పెద్ద సంఖ్య‌లో న‌మోద‌వుతున్నాయి. రోజూ రెండు వేల‌కు త‌గ్గ‌కుండా కొత్త కేసులు న‌మోద‌వుతుండ‌టంతో ఆ రాష్ట్రంలో న‌మోదైన మొత్తం కేసుల సంఖ్య ఇప్ప‌టికే 1.20 ల‌క్ష‌లు దాటింది. మొత్తం కేసుల‌లో ఇప్ప‌టివ‌ర‌కు 61 వేల మందికి పైగా డిశ్చార్జి కాగా, 54 వేలకు యాక్టివ్ కేసులు ఉన్నాయి. వారంతా రాష్ట్రంలోని వేర్వేరు ఆస్ప‌త్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇక మ‌ర‌ణాలు కూడా రాష్ట్రంలో భారీగానే న‌మోద‌వుతున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం 5,800కు పైగా క‌రోనా బారిన‌ప‌డి మ‌ర‌ణించారు. 

ఇక మ‌హారాష్ట్ర రాజ‌ధాని ముంబైలో ప‌రిస్థితి మ‌రింత దారుణంగా ఉన్న‌ది. అక్క‌డ న‌మోదైన క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఇప్ప‌టికే 63 వేలు దాటింది. మ‌ర‌ణాలుఉ 3,300పైగా న‌మోద‌య్యాయి. న‌గ‌రంలో న‌మోదైన మొత్తం కేసుల‌లో 32 వేల మందికిపైగా డిశ్చార్జి కాగా, ఇంకా 28 వేల‌కు పైగా యాక్టివ్ కేసులు ఉన్నాయి. న‌గ‌రంలోని వివిధ ఆస్ప‌త్రుల్లో వారు చికిత్స పొందుతున్నారు. 

ముంబై త‌ర్వాత మ‌హారాష్ట్ర‌లో క‌రోనాకు అత్యంత ప్ర‌భావిత‌మైన న‌గ‌రం థానే. థానేలో ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 21 వేలు దాటింది. 670కి పైగా మ‌ర‌ణాలు న‌మోద‌య్యాయి. 9 వేల మందికి పైగా వైర‌స్ నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జి కాగా, మ‌రో 11,500పైగా యాక్టివ్ కేసులు ఉన్నాయి.  

మ‌హారాష్ట్రంలో మార్చి 9న తొలి క‌రోనా కేసు న‌మోదైంద‌ని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ‌ అధికారులు తెలిపారు. గ‌త మూడు నెల‌ల కాలంలో క‌రోనా కేసుల పెరుగుద‌ల రేటు త‌గ్గింద‌ని, అదేస‌మ‌యంలో క‌రోనా కేసుల డ‌బులింగ్ వ్య‌వ‌ధి పెరిగింద‌ని వారు వెల్ల‌డించారు. మార్చి 31న కేసుల‌ డబులింగ్ టైమ్ 3.5 రోజులుగా, వీక్లీ యావరేజ్ గ్రోత్ రేట్ 12 శాతంగా ఉంద‌ని.. ప్ర‌స్తుతం కేసుల డ‌బులింగ్ టైమ్ 25.9 రోజుల‌కు పెరుగ‌గా, వీక్లీ యావ‌రేజ్ గ్రోత్ రేట్ 3 శాతానికి త‌గ్గింద‌ని అధికారులు తెలిపారు. ప్ర‌స్తుతం మ‌హారాష్ట్ర‌లో క‌రోనా కేసుల రిక‌వ‌రీ రేటు 50.49 శాతంగా, మ‌ర‌ణాల రేటు 4.77 శాతంగా ఉంద‌ని చెప్పారు.       


logo