బుధవారం 12 ఆగస్టు 2020
National - Jul 12, 2020 , 18:28:56

తమిళనాడులో కరోనా మరణ మృదంగం

తమిళనాడులో కరోనా మరణ మృదంగం

చెన్నై : తమిళనాడులో కరోనా గడగడలాడిస్తోంది. రోజూ వేలల్లో కేసులు నమోదు కావడమే కాకుండా మరణాల సంఖ్య కూడా పెరుగుతుండడంతో జనం కంటి మీద కునుకు ఉండడం లేదు. ఇటీవల ఆ రాష్ట్రంలో కరోనా వ్యాధి తీవ్రత అధికంగా ఉన్న 5 జిల్లాల్లో రెండోసారి కఠిన లాక్‌డౌన్‌ విధించినా ఫలితం లేకుండా పోయింది. 

తాజాగా గడిచిన 24 గంటల్లో 68మంది కరోనా వ్యాధితో మృత్యువాత పడ్డారు. ఒకేరోజు 4,244 రికార్డు కరోనా కేసులు నమోదు కాగా సుమారు 3,617 మంది డిశ్చార్జి అయినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తెలియజేసింది. దీంతో ఇప్పటివరకు అక్కడ 1,38,470 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. అందులో 46,969 మంది దవాఖానల్లో చికిత్స పొందుతుండగా మొత్తం 1,966 మంది కరోనాతో మరణించినట్లు అధికారులు ధృవీకరించారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo