న్యూఢిల్లీ : విక్కీ కౌశల్, సారా అలీఖాన్ జంటగా తెరకెక్కిన జర హట్కే జర బచ్కే మూవీ నుంచి ఓ సాంగ్‌ను ఢిల్లీ కానిస్టేబుల్ హృద్యంగా ఆలపించిన వీడియో (Viral Video) ప్రస్తుతం నెట్టింట తెగ వైరలవుతోంది. ఈ వీడియోలో కనిపించిన పోలీస్‌ను రజత్ రాథోడ్‌గా గుర్తించారు. రాథోడ్ ఈ వీడియోను తన ఇన్స్టాగ్రాం ఖాతాలో షేర్ చేశారు.
అతడి మెలోడియస్ వాయిస్ నెటిజన్లను మంత్రముగ్ధులను చేసింది. అతడు గతంలోనూ తన మధురమైన గాత్రంతో పలు వీడియోలతో వీక్షకులను ఆకట్టుకున్నాడు. ఇక లేటెస్ట్ వీడియోలో రజత్ ఫిర్ ఔర్ క్యా చాహియే సాంగ్‌ను అద్భుతంగా ఆలపించాడు. ఈ సాంగ్ దాదాపు ఇన్స్టాగ్రాం రీల్స్ అన్నింటికీ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌గా వాడుతుంటారు.
ఇక రజత్ మెలోడియస్ వాయిస్ ఈ పాటను నెక్ట్స్ లెవెల్‌కు తీసుకువెళ్లింది. ఇక నెటిజన్లు అతడి గాత్రానికి ఫిదా అవుతూ అమేజింగ్ వాయిస్ అంటూ కామెంట్స్ సెక్షన్‌ను ప్రశంసలతో హోరెత్తించారు. ఇక ఫిర్ అవుర్ క్యా చాహియే సాంగ్‌ను ఆర్జిత్ సింగ్ ఆలపించగా, సచిన్ జిగర్ స్వరాలు సమకూర్చారు. ఈ పాటను అమితాబ్ భట్టాచార్య రాశారు.
Read More
Beer Bottles | బీర్ల లోడ్‌తో వెళ్తున్న లారీ బోల్తా.. ఎగబడిన జనాలు