Beer Bottles | బీర్ల లోడ్‌తో వెళ్తున్న లారీ బోల్తా.. ఎగబడిన జనాలు
అనకాపల్లి (Anakapally) జిల్లా కాశింకోట (Kasimkota) మండలం బయ్యవరం (Bayyavaram) వద్ద జాతీయ రహదారిపై బీర్ల లోడుతో వెళ్తున్న వ్యాన్ అతుపుతప్పి బోల్తా పడింది (Overturned). దీంతో వ్యాన్‌లో ఉన్న బీరు బాటిళ్లు చెల్లాచదురుగా కిందపడిపోయాయి.
అనకాపల్లి: అసలే ఎండలు మండిపోతున్నాయి. బీర్లకు మస్త్ డిమాండ్ ఉంది. ఎన్నడూ లేనంతగా తాగేస్తున్నారు. రికార్డ్ స్థాయిలో అమ్మకాలు జరుగుతున్నాయి. అలాంటిది.. కళ్ల ముందు పెద్దసంఖ్యలో బీరు బాటిళ్లు (Beer bottles) కనిపిస్తే జనాలు ఆగుతారా! ఆంధ్రప్రదేశ్‌లోని (Andhrapradesh) అనకాపల్లి జిల్లాలో అదే జరిగింది. అనకాపల్లి (Anakapally) జిల్లా కాశింకోట (Kasimkota) మండలం బయ్యవరం (Bayyavaram) వద్ద జాతీయ రహదారిపై బీర్ల లోడుతో వెళ్తున్న వ్యాన్ అతుపుతప్పి బోల్తా పడింది (Overturned). దీంతో వ్యాన్‌లో ఉన్న బీరు బాటిళ్లు చెల్లాచదురుగా కిందపడిపోయాయి.
ఈ వార్త చుట్టుపక్కల ఊర్లకు నిమిషాల్లోని పాకింది. ఇంకేముందు జనాలు ఎగబడ్డారు. రోడ్డుపై పడి పగిలిపోయిన సీసాలను వదిలేసిన స్థానికులు.. మిగిలిన వాటిని ఎవరి చేతుల్లో ఎన్ని పడితే అన్ని ఎత్తుకెళ్లారు. వ్యాన్ బోల్తా పడటంతో రోడ్డుపై ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో ప్రయాణికులు కూడా చేతికందినన్ని బీరు సీసాలు ఎత్తుకెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితి చక్కదిద్దారు. వ్యాన్‌లో 200 పైగా బీరు కాటన్లు ఉన్నాయని అధికారులు చెప్పారు.

Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దక్షిణాది వారికే ఛాన్స్ ఇవ్వాలి
Woman Delivers Baby On Bus | బస్సులో ప్రయాణించిన గర్భిణీకి ప్రసవ వేదన.. ఆడ బిడ్డకు జన్మ
Polio Drops | పోలియో గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

