లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా జరుగుతున్నది. త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాల కోసం అక్కడకు వస్తున్న లక్షలాది భక్తుల కోసం కొన్ని స్వచ్చంధ సంస్థలు ఆహారాన్ని సరఫరా చేస్తున్నాయి. అయితే ఒక పోలీస్ అధికారి దారుణంగా ప్రవర్తించాడు. ఒకచోట వండుతున్న ఆహారంలో మట్టిపోశాడు. (Cop Dumps Soil In Food) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ప్రయాగ్‌రాజ్‌లో ఆహారాన్ని తయారు చేసే ‘భండారా’ వద్ద ఈ సంఘటన జరిగింది. ఇటుకల పొయ్యిపై పెట్టిన పెద్ద పాత్రల్లో కొందరు వ్యక్తులు ఆహారం వండుతున్నారు. ఇంతలో ఒక పోలీస్ అధికారి అక్కడకు వచ్చాడు. వండుతున్న ఆహార పాత్రలోకి మట్టి వేశాడు.
కాగా, ఉత్తరప్రదేశ్‌లో ప్రధాన ప్రతిపక్షమైన సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ఈ వీడియో క్లిప్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ‘మహా కుంభమేళాలో చిక్కుకున్న వారికి ఆహారం, నీరు అందించడానికి ఏర్పాట్లు చేస్తున్న వారి మంచి ప్రయత్నాలు, రాజకీయ శత్రుత్వం కారణంగా విఫలమవడం దురదృష్టకరం. ప్రజలు గమనించాలి’ అని అందులో పేర్కొన్నారు.
మరోవైపు ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ఆహారం తయారు చేస్తున్న పాత్రలో మట్టి పోసిన పోలీస్ అధికారిని సోరాన్ పోలీస్ స్టేషన్ ఇన్చార్జ్ బ్రిజేష్ తివారీగా గుర్తించారు. ఆయనను సస్పెండ్ చేసినట్లు పోలీస్ ఉన్నతాధికారులు తెలిపారు.
ये दुर्भाग्यपूर्ण है कि जो लोग महाकुंभ में फँसे लोगों के लिए भोजन-पानी की व्यवस्था कर रहे है उनके सद्प्रयासों के ऊपर राजनीतिक विद्वेषवश मिट्टी डाल दी जा रही है।
जनता संज्ञान ले! pic.twitter.com/LTwwKbBwO5
— Akhilesh Yadav (@yadavakhilesh) January 30, 2025