పాట్నా: ఇద్దరు పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో సర్వీస్ గన్‌తో సహోద్యోగిని ఒక పోలీస్ కాల్చి చంపాడు. (Cop Shot Dead By Colleague) ఆ తర్వాత బిల్డింగ్‌పైకి ఎక్కి హంగామా చేశాడు. అప్రమత్తమైన మిగతా పోలీసులు అతడ్ని పట్టుకుని అరెస్ట్ చేశారు. బీహార్‌లోని పశ్చిమ చంపారన్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. బెట్టియాలోని పోలీస్ లైన్‌కు ట్రాన్స్ఫర్ అయిన పోలీస్ కానిస్టేబుల్స్ సోను కుమార్, సర్వజీత్ కుమార్ మధ్య శనివారం రాత్రి వాగ్వాదం జరిగింది. ఆగ్రహించిన సర్వజీత్ కుమార్ తన వద్ద ఉన్న సర్వీస్ గన్‌తో సోను కుమార్‌పై కాల్పులు జరిపాడు. దీంతో తీవ్రంగా గాయపడిన అతడు అక్కడికక్కడే మరణించాడు.
కాగా, సహోద్యోగి సోను కుమార్‌ను కాల్చి చంపిన సర్వజీత్ కుమార్ ఆ తర్వాత బిల్డింగ్‌పైకి వెళ్లాడు. సర్వీస్ రివాల్వర్‌తో భయపెట్టేందుకు ప్రయత్నించాడు. అయితే పోలీసులు చుట్టుముట్టి అతడ్ని నిరాయుధుడ్ని చేసి అరెస్ట్ చేశారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి వెల్లడించారు.