పాట్నా: భద్రత కోసం డ్యూటీలో ఉన్న పోలీస్ అధికారిని రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు, ఆ పార్టీ ఎమ్మెల్యే తేజ్ ప్రతాప్ యాదవ్ (Tej Pratap Yadav) బెదిరించారు. హోలీ సందర్భంగా డ్యాన్స్ చేయకపోతే ఆయన సస్పెండ్ అవుతారని హెచ్చరించారు. దీంతో ఆ పోలీస్ అధికారి డ్యాన్స్ చేశారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. బీహార్ రాజధాని పాట్నాలోని తన నివాసంలో మార్చి 14న హోలీ వేడుకను తేజ్ ప్రతాప్ యాదవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన భద్రత కోసం డ్యూటీలో ఉన్న పోలీస్ అధికారిని డ్యాన్స్ చేయమని ఆదేశించారు. ‘నేను ఒక పాట ప్లే చేస్తా. నువ్వు డాన్స్ చేయాలి. లేకపోతే నువ్వు సస్పెండ్ అవుతావు’ అని బెదిరించారు. అలాగే ఇది హోలీ అని తన వ్యాఖ్యలకు బాధపడవద్దని అన్నారు. దీంతో కాస్త సంకోచించిన ఆ పోలీస్ అధికారి చివరకు డ్యాన్స్ చేశారు.
కాగా, ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో బీహార్‌లో అధికారంలో ఉన్న జేడీయూ, బీజేపీ తేజ్ ప్రతాప్‌పై మండిపడ్డాయి. లాలూ, రబ్రీ దేవి పాలనను ఇది గుర్తు చేస్తున్నదని జేడీయూ అధికార ప్రతినిధి అరవింద్ నిషాద్ ఆరోపించారు. అయితే ఎవరిని సస్పెండ్ చేసే అధికారం తేజ్ ప్రతాప్‌కు లేదని బీజేపీ నేత షానవాజ్ హుస్సేన్ అన్నారు. ఇది నితీశ్ కుమార్ ప్రభుత్వమని, జంగిల్ రాజ్ కాదని విమర్శించారు. ఆర్జేడీ నేతలు ఇంకా ఎదగలేదని ఎద్దేవా చేశారు.
🚨 “Thumka Nahi Lagaoge Toh Suspend Kar Denge!” 😲🔥
At a Holi event in Patna, RJD supremo Lalu Prasad’s elder son Tej Pratap Yadav ordered a police constableon duty to dance—or face suspension! 👀💃The cop, under pressure, gave in and danced, while the viral videosparked outrage… pic.twitter.com/emFFaggm9G— Patna Press (@patna_press) March 15, 2025