న్యూఢిల్లీ, అక్టోబర్ 1: వంటగ్యాస్ ధర మళ్లీ పెరిగింది. హోటళ్లు, రెస్టారెంట్లలో వినియోగించే 19 కిలోల కమర్షియల్ సిలిండర్‌పై రూ.48.5 పెరిగింది. వరుసగా గత మూడు నెలల నుంచి వాణిజ్య సిలిండర్ ధర పెరుగుతూ వస్తున్నది. మొత్తం ఈ మూడు నెలల్లో రూ.94 మేర పెరిగింది. గృహ అవసరాలకు వాడే గ్యాస్ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు లేదు. మరోవైపు, విమాన ఇంధన ధర 6 శాతం తగ్గింది. కిలోలీటరకు రూ.5,883 మేర చమురు కంపెనీలు తగ్గించాయి.