వంటగ్యాస్ ధర మళ్లీ పెరిగింది. హోటళ్లు, రెస్టారెంట్లలో వినియోగించే 19 కిలోల కమర్షియల్ సిలిండర్‌పై రూ.48.5 పెరిగింది. వరుసగా గత మూడు నెలల నుంచి వాణిజ్య సిలిండర్ ధర పెరుగుతూ వస్తున్నది.
ఎన్నికలకు ముందు వంట గ్యాస్ ధరను రూ.200 తగ్గిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై కేంద్ర మాజీ మంత్రి కపిల్ సిబల్ స్పందించారు. ఇది రేవ్డీ సంస్కృతి కాకపోతే మరేమిటి? అని నిలదీశారు.
కేంద్ర ప్రభుత్వం పెంచిన ధరలతో సామాన్యుడి బతుకు భారమైంది. బీజేపీ తొమ్మిదేండ్ల పాలనలో అన్ని రకాల వస్తువుల ధరలు రెట్టింపయ్యాయి. నిత్యావసరాల ధరలు ఎనిమిదేండ్లలో 20నుంచి 50శాతం వరకు పెరిగాయి.